ఇద్దరు భామలతో “రామారావు” రొమాన్స్

మాస్ మహారాజా రవితేజ ఇటీవలే తన 68వ చిత్రాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. శరత్ మాండవ దర్శకత్వంలో రూపొందుతున్న “రామారావు ఆన్ డ్యూటీ” సినిమా ఫస్ట్ లుక్ ను ఇటీవలే రిలీజ్ చేశారు. ఫస్ట్ లుక్ కు మంచి స్పందన రాగా… ఇటీవలే సినిమా షూటింగ్ కూడా ప్రారంభించారు. శరవేగంగా సినిమా చిత్రీకరణ జరుగుతోంది. “రామారావు ఆన్ డ్యూటీ” కోసం సంగీత దర్శకుడు సామ్ సిఎస్, ఎడిటర్ ప్రవీణ్, సినిమాటోగ్రాఫర్ సత్యన్ సూర్యన్ సహా రవితేజ పూర్తిగా కొత్త బృందంతో కలిసి పని చేస్తున్నారు.

Read Also : ‘బాయ్స్’ నుండి భారీ మొత్తం తీసుకున్న సన్నీ లియోన్!

ఈ ముగ్గురు సాంకేతిక నిపుణులకూ తమిళ సినిమాల్లో మంచి గుర్తింపు ఉంది. కాగా తాజాగా ఈ సినిమాలో రవితేజ సరసన ఇద్దరు భామలు ఆడిపాడనున్నట్టు తెలుస్తోంది. తాజాగా దీనికి సంబంధించిన ధృవీకరణ కూడా అయిపోయింది. “రామారావు” కోసం ‘మజిలి’ ఫేమ్ దివ్యాన్ష కౌశిక్, మలయాళ నటి రజీషా విజయన్ హీరోయిన్లుగా ఎంపికయ్యారు. రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ధనుష్ బ్లాక్ బస్టర్ మూవీ “కర్ణన్”లో రజిషా విజయన్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఆమె సూర్యతో కలిసి తమిళంలో ఓ సినిమా చేస్తోంది. కాగా ఈ చిత్రం రవితేజ కెరీర్‌లోని ఉత్తమ చిత్రాలలో ఒకటిగా నిలవనుంది అంటున్నారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-