Raashi Khanna: సిద్ధూ జొన్నలగడ్డ, రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘తెలుసు కదా’ విడుదల కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ నీరజ కోన దర్శకురాలిగా పరిచయం అవుతున్న ఈ సినిమా అక్టోబర్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా సినిమా ప్రమోషన్లలో పాల్గొన్న హీరోయిన్ రాశీ ఖన్నా, హీరో సిద్ధూ జొన్నలగడ్డ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Read Also: TG Police: హ్యాట్స్ ఆఫ్ సర్.. ఆత్మహత్యాయత్నం చేసిన మహిళ ప్రాణాలను కాపాడిన పొలీసులు
సాధారణంగా బయట సిద్ధూ చాలా సరదాగా, చలాకీగా ఉంటాడనే అభిప్రాయం అందరిలోనూ ఉంది. సెట్స్‌లో కూడా సిద్ధూ అలాగే ఉంటాడని తాను మొదట్లో అనుకున్నానని రాశీ ఖన్నా తెలిపారు. “సిద్ధూ జొన్నలగడ్డ గురించి అందరూ అనుకున్నట్టే నేను కూడా చాలా సరదాగా ఉంటాడని ఊహించాను. అయితే, సెట్స్‌లో అతన్ని చూసి నేను నిజంగా షాక్ అయ్యాను” అని రాశీ అన్నారు.
Read Also: AP Fake Liquor Case: ఏపీలో కల్తీ మద్యం కేసులో విస్తుబోయే నిజాలు బయటపెడుతున్న ఎక్సైజ్ శాఖ!
“సిద్ధూ సెట్స్‌లో చాలా సీరియస్‌గా ఉండేవాడు. ఫ్రేమ్ సెట్ చేయగానే మళ్లీ వెంటనే పాత్రలోకి పూర్తిగా లీనమైపోయేవాడు. సిద్ధూ తన పనిని, నటనను చాలా గౌరవిస్తాడు. అందుకే పని విషయంలో అతను అంత సీరియస్‌గా ఉంటాడు” అని రాశీ ఖన్నా చెప్పుకొచ్చింది. సిద్ధూ జొన్నలగడ్డలో తాను ఊహించని ఈ కోణం తనను ఆశ్చర్యపరిచిందని రాశీ వెల్లడించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ ట్రైయాంగిల్ లవ్ స్టోరీకి తమన్ సంగీతం అందించారు. ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ అక్టోబర్ 17న దీపావళి కానుకగా విడుదల కానుంది.