Site icon NTV Telugu

Raashii Khanna: రాశీ ఖన్నాకి రెండు ప్రేమకథలు!.. షాకింగ్ విషయం వెలుగులోకి?

Kanna

Kanna

Raashii Khanna: సిద్ధూ జొన్నలగడ్డ, రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘తెలుసు కదా’ అక్టోబర్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ నీరజ కోన ఈ సినిమాతో దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు. లవ్ స్టోరీగా రూపొందిన ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా హీరోయిన్ రాశీ ఖన్నా ప్రేమకు సంబంధించి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తాను తన జీవితంలో రెండు సార్లు ప్రేమలో పడ్డానని రాశీ ఖన్నా వెల్లడించారు. సినిమాల్లోకి రాకముందు ఒకసారి, ఆ తర్వాత మరోసారి ప్రేమలో ఉన్నానని తెలిపారు.

Read Also: Raashi Khanna: సెట్స్‌లో సిద్ధూ ఇలా చేస్తాడని అనుకోలేదు.. చూసి షాక్ అయ్యా!

ఈ సందర్భంగా రాశీ ఖన్నా మాట్లాడుతూ, “ప్రేమ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటుంది. నాకు కూడా ప్రేమ అనుభవాలు ఉన్నాయి. నేను నా లైఫ్‌లో రెండు సార్లు ప్రేమలో ఉన్నాను. ఒకటి సినీ రంగంలోకి రాకముందు, మరొకటి సినిమాల్లోకి వచ్చాక” అని తెలిపారు. అయితే, ప్రస్తుతం ఆ ప్రేమ బంధం కొనసాగుతుందా లేదా అనే విషయం మాత్రం చెప్పలేనని కామెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశమయ్యాయి. ‘తెలుసు కదా’ సినిమా ట్రైయాంగిల్ లవ్ స్టోరీగా రూపొందుతున్నట్లు తెలుస్తోంది. మరి రాశీ ఖన్నా నిజ జీవిత ప్రేమ కథలు ఏంటో తెలుసుకోవాలంటే.. ఆమె పూర్తి ఇంటర్వ్యూ చూడాల్సిందే. ఇక పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించారు. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ అక్టోబర్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Exit mobile version