R Narayanamurthy Hospitalised: ప్రముఖ నటుడు, దర్శక నిర్మాత పీపుల్ స్టార్ ఆర్ నారాయణమూర్తి ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. కొంతకాలంగా ఆర్ నారాయణమూర్తి అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నాడని చెబుతున్నారు. ఆయన ఆరోగ్యం స్వల్పంగా దెబ్బతినడంతో బుధవారం ఉదయం హైదరాబాద్లో నిమ్స్ ఆస్పత్రిలో ఆయనని జాయిన్ చేసినట్టు సన్నిహితులు వెల్లడించారు. ఆయనకు ఏర్పడిన అనారోగ్యం ఏమిటి అనే విషయం మీద క్లారిటీ లేదు కానీ ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయనకు నిమ్స్ డాక్టర్ బీరప్ప పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నారని తెలుస్తోంది.
Sardar 2 : సర్దార్ 2 షూట్లో ప్రమాదం.. స్టంట్ మ్యాన్ మృతి.. లేఖ రిలీజ్ చేసిన నిర్మాణ సంస్థ
ఇక ఆయన ఆసుపత్రిలో ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆర్.నారాయణమూర్తికి తెలుగు సినీ పరిశ్రమలో చాలా సింపుల్ గా ఉంటాడనే పేరు ఉంది ఆయన ఇప్పటికీ ఎక్కడికి వెళ్ళినా ఆటోలోనే ప్రయాణిస్తూ ఉంటారు. అంతేకాదు హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ లోనే ఆయన హైదరాబాద్ వచ్చినప్పుడు నడుం వాలుస్తూ ఉంటారు. ప్రసాద్ ల్యాబ్ లోని సెక్యూరిటీ రూమ్ లోనే ఆయన రెస్ట్ తీసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఆర్. నారాయణ మూర్తి ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిన ఆయన అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు త్వరగా కోలుకొని మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుంటున్నారు.