Accident In Karthi Sardar 2 Shooting Spot Prince Pictures : సర్దార్ 2 షూటింగ్ స్పాట్‌లో జరిగిన ప్రమాదంలో ఏలుమలై అనే స్టన్ మ్యాన్ విషాదకరంగా మరణించాడు. పిఎస్ మిత్రన్ దర్శకత్వంలో కార్తీ హీరోగా తెరకెక్కుతున్న సర్దార్ రెండవ భాగం ప్రస్తుతం రూపొందుతోంది. సర్దార్ 2 సినిమా షూటింగ్ రెండు రోజుల క్రితం ప్రారంభం కాగా ఈ సినిమా షూటింగ్ సమయంలో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో స్టంట్ మ్యాన్ ఏలుమలై మృతి చెందాడు. మిత్రన్ దర్శకత్వం వహించగా కార్తీ నటించిన సర్దార్ 2022 దీపావళికి విడుదలై బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. సర్దార్ ఆ సంవత్సరంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలలో ఒకటిగా నిలిచింది. ఈ సందర్భంగా ఈ చిత్రం యొక్క రెండవ భాగం గురించి కొన్ని వారాల క్రితం అధికారిక ప్రకటన వచ్చింది. ఆ తర్వాత రెండు రోజుల క్రితమే ఈ సినిమా పూజా కార్యక్రమాలను పూర్తి చేసి షూటింగ్‌ను ప్రారంభించారు.గ్లోబల్ స్కేల్ లో ఈ సినిమా షూటింగ్ చాలా దేశాల్లో జరుగుతుండటంతో కార్తీ ఈ సినిమా కోసం ఎక్కువ రోజులు కాల్షీట్ ఇచ్చాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సందర్భంలో ఈ సినిమా షూటింగ్ కొద్దిరోజుల క్రితం చెన్నైలో ప్రారంభమైంది. ప్రసాద్ స్టూడియోలో వేసిన సెట్స్‌లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది.
Double Ismart: సాంగులో కేసీఆర్ డైలాగ్.. పూరీ ఇంటిని ముట్టడిస్తామని బీఆర్ఎస్ కార్యకర్తల వార్నింగ్!
ఈ సినిమా షూటింగ్ సమయంలో స్టంట్ మ్యాన్ ఏలుమలై ఎత్తు నుంచి పడిపోయి తీవ్రంగా గాయపడ్డాడు. తీవ్రంగా గాయపడిన స్టంట్ మ్యాన్ ఏలుమలై విషాదకరంగా మృతి చెందాడు. ఈ వార్త యావత్ చిత్ర పరిశ్రమను విషాదంలో ముంచెత్తింది. స్టంట్ సీన్ చిత్రీకరిస్తుండగా 20 ఎత్తు నుంచి కిందపడి ఏలుమలై మరణించాడు. పై నుంచి కిందపడటంతో ఛాతీలో గాయం, ఊపిరితిత్తుల్లో రక్తస్రావం కావడంతో మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఇదే విషయాన్ని ఈ సినిమా నిర్మాణ సంస్థ ప్రిన్స్ పిక్చర్స్ ధ్రువీకరించింది. సర్దార్ 2 సినిమా సెట్స్ లో జరిగిన ప్రమాదం కారణంగా ఏలుమలై అనే స్టంట్ మాన్ మరణించినట్లుగా వెల్లడించింది. షూట్ ముగిస్తున్న సమయంలో ఏలుమెలై దురదృష్ట వ్యవసాయత్తు 20 అడుగుల ఎత్తు నుంచి కిందపడి గాయాలు పాలయ్యాడని వెంటనే దగ్గరలో ఉన్న మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ తిరిగి తీసుకెళ్లామని పేర్కొన్నారు. అక్కడే ఉన్న డాక్టర్స్ టీం ఎంత కష్టపడినా ఆయనను బతికించుకోలేకపోయామని నిన్న రాత్రి 11:30 గంటల సమయంలో ఆయన కన్నుమూసేడని చెప్పుకొచ్చింది. ఏలుమలై కుటుంబానికి తాము అండగా నిలబడతామని ఈ సందర్భంగా నిర్మాణ సంస్థ వెల్లడించింది.