Husharu 2: చాలా ఏళ్ల తర్వాత నాకు మంచి రోల్ దక్కింది: ఆర్. నారాయణమూర్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Husharu 2: పీపుల్స్ స్టార్ ఆర్.నారాయణమూర్తి వెండితెరపై కనిపించి చాలా కాలమే అయింది. తనదైన విప్లవాత్మక, సందేశాత్మక చిత్రాలతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఆయన, తాజాగా యూత్‌ఫుల్ మూవీ ‘హుషారు 2’లో ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ చిత్ర టీజర్ లాంచ్ ఈవెంట్‌కు గెస్ట్‌గా వచ్చిన నారాయణమూర్తి.. చాలా ఏళ్ల తర్వాత తనకు ఇంత గొప్ప పాత్ర దక్కడంపై మనసు విప్పి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆర్.నారాయణమూర్తి మాట్లాడుతూ.. “దర్శకుడు శ్రీ హర్ష గారు ‘హుషారు 2’లో నాకు చాలా గొప్ప పాత్ర ఇచ్చారు. నిజం చెప్పాలంటే ఎన్నో ఏళ్ల తర్వాత నాకు ఇంతటి సంతృప్తినిచ్చే మంచి క్యారెక్టర్ దొరికింది” అంటూ సంతోషం వ్యక్తం చేశారు. తన పాత్ర ద్వారా నేటి తరానికి బలమైన విషయాన్ని చెప్పే అవకాశం ఇచ్చినందుకు ఆయన దర్శకుడికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
డైరెక్టర్ పనితీరును మెచ్చుకుంటూ నారాయణమూర్తి పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు. “దర్శకుడు హర్ష పని విషయంలో అస్సలు తగ్గడు, ఎక్కడా రాజీ పడడు. లెజెండరీ దర్శకుడు రవిరాజా పినిశెట్టి తర్వాత నాకు మళ్లీ హర్షలోనే ఆ పట్టుదల, రాజీపడని ఆ క్వాలిటీ కనిపించింది” అని చెప్పారు. మంచి సినిమా తీయాలనే తపన ఉన్న ఇలాంటి దర్శకులను ఆడియన్స్ తప్పకుండా ఆదరిస్తారని అన్నారు. ‘హుషారు 2’ సినిమా కేవలం కామెడీ కోసమే కాకుండా సమాజం ఆలోచించేలా ఉంటుందని నారాయణమూర్తి స్పష్టం చేశారు. ముఖ్యంగా నేటి యువతరం ఎదుర్కొంటున్న నిరుద్యోగ సమస్యను, శ్రమకు తగ్గ గుర్తింపు లేక నలిగిపోతున్న తీరును సినిమాలో చాలా సహజంగా చూపించారని చెప్పారు. కుర్రాళ్లు ఆత్మాభిమానంతో, స్వేచ్ఛగా తమ కాళ్లపై తాము ఎలా నిలబడాలనే మంచి సందేశాన్ని ఇచ్చారని, ఈ చిత్రం కచ్చితంగా పెద్ద హిట్ కొడుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
Also Read
- Avengers Doomsday: ఒక రోజు ముందే ఇండియాలో ‘ఎవెంజర్స్ డూమ్స్‌డే’ రిలీజ్! రీజన్ ఇదేనా..
- Inji Vellam: చడీచప్పుడు లేకుండా షూటింగ్ ముగించేసిన మణిరత్నం! రిలీజ్ ఎప్పుడంటే?
- Mouli: ఫ్యూచర్ ప్రాజెక్టులపై యంగ్ హీరో బోల్డ్ కామెంట్స్!
- Karthik Subbaraj: ‘గేమ్ ఛేంజర్’ ఒరిజినల్ కాన్సెప్ట్ బయటపెట్టిన కార్తీక్ సుబ్బరాజ్!
దర్శకుడు శ్రీ హర్ష మాట్లాడుతూ.. నారాయణమూర్తి లాంటి సీనియర్ నటుడితో పనిచేయడం తనకు దక్కిన గొప్ప గౌరవమని చెప్పారు. థియేటర్లలో ఆయనతో వచ్చే సీన్లు ఆడియన్స్‌ను కడుపుబ్బా నవ్విస్తూనే క్లాప్స్ కొట్టిస్తాయని నమ్మకం వ్యక్తం చేశారు. తన రియల్ లైఫ్ ఫ్రెండ్స్‌తో జరిగిన సంఘటనల ఆధారంగానే ‘హుషారు 2’ను తెరకెక్కించినట్లు ఆయన తెలిపారు. అశోక్ గల్లా, రాహుల్ రామకృష్ణ, దినేష్ తేజ్, రవి ఆంటోనీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌తోనే మంచి బజ్ తెచ్చుకుంది. ఎన్నో ఏళ్ల తర్వాత నారాయణమూర్తిని కొత్త లుక్‌లో, సరికొత్త పాత్రలో చూసేందుకు ఆడియన్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
తాజావార్తలు
-
Husharu 2: చాలా ఏళ్ల తర్వాత నాకు మంచి రోల్ దక్కింది: ఆర్. నారాయణమూర్తి
-
El Nino: ఎల్‌నినో ముప్పు.. తెలంగాణలో కరువు ముప్పుపై అఖిలపక్ష భేటీ
-
Abhijeet Dipke: ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టుల తొలగింపు.. కేంద్రంపై అభిజిత్ దీప్కే సంచలన ఆరోపణలు
-
AP Weather Alert: 9 జిల్లాల్లో భారీ వర్షాలు.. మరో 3 గంటలు జాగ్రత్త.. ఇంట్లోనే సురక్షితంగా ఉండండి: APSDMA
-
Avengers Doomsday: ఒక రోజు ముందే ఇండియాలో ‘ఎవెంజర్స్ డూమ్స్‌డే’ రిలీజ్! రీజన్ ఇదేనా..
ట్రెండింగ్
-
Room Heater Cleaning Tips : చలికాలం వచ్చేసింది.. రూమ్ హీటర్ వాడే ముందు ఇది చేయండి
-
Arnab Cyclone: సగం దేశాన్ని వణికిస్తున్న తుఫాను.. భయానకంగా ‘అర్నబ్’ తుఫాను శాటిలైట్ ఫొటోలు..
-
Reliance Group: టాటా గ్రూప్‌ను అధిగమించి దేశంలోనే నెం.1గా నిలిచిన రిలయన్స్ గ్రూప్!
-
Mukesh Ambani: జియో లిస్టింగ్ వేడుకలో ఎమోషనల్.. కన్నీళ్లు పెట్టుకున్న ముఖేష్ అంబానీ..
-
Abhishek Sharma: ఓ రాక్షసుడిలా చెలరేగాడు.. అంతటి విధ్వంసకర బ్యాటింగ్ ఎన్నడూ చూడలేదు!