GDN : సైలెంటుగా తెలుగులోకి మాధవన్ G D నాయుడు

Gd Naidu Release

Gd Naidu Release

‘ప్రతిష్టాత్మక బయోపిక్‌లు అనగానే గుర్తుకొచ్చే అతికొద్ది మంది నటుల్లో ఆర్‌. మాధవన్ ఒకరు. ‘రాకెట్రి: ది నంబి ఎఫెక్ట్’ చిత్రంతో భారతీయ అంతరిక్ష శాస్త్రవేత్త కథను ఆవిష్కరించి జాతీయ స్థాయిలో అభినందనలు అందుకున్న మాధవన్, ఇప్పుడు మరొక మహోన్నతమైన భారతీయ ఆవిష్కర్త జీవిత కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. నటుడు, దర్శకుడు కృష్ణకుమార్‌ రామకుమార్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘జి.డి.నాయుడు’ (GDN). భారతీయ సాంకేతిక రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన ప్రముఖ శాస్త్రవేత్త, ఆవిష్కర్త గోపాల స్వామి దొరైస్వామి నాయుడు (జి.డి.ఎన్‌) జీవిత ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ‘ఎడిసన్ ఆఫ్ ఇండియా’, ‘మిరాకిల్ మేన్’, ‘వెల్త్ క్రియేటర్ ఆఫ్ కోయంబత్తూర్’ అని ప్రసిద్ధి చెందిన ఆయన పోరాటం, శ్రమను వెండితెరపై ఆవిష్కరించే పాత్రలో మాధవన్ నటించారు.

ఈ సినిమాలో సత్యరాజ్, జయరామ్, ప్రియమణి, దుషారా విజయన్ మరియు వినయ్ రాయ్ కీలక పాత్రలలో మెరవనున్నారు. గోవింద్ వసంత అందించిన నేపథ్య సంగీతం ఈ పీరియాడికల్ డ్రామాకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. గతంలో నంబి నారాయణన్ పాత్ర కోసం ఎంతగానో కష్టపడిన మాధవన్, ఈ చిత్రం కోసం కూడా సరికొత్త మేకోవర్‌తో డిఫరెంట్ గెటప్స్‌లో కనిపించబోతున్నారు. ఈ చిత్ర నిర్మాణ విలువలు, నాచురల్ పీరియాడికల్ సెటప్ సినిమాపై అంచనాలను భారీగా పెంచాయి. ఇటీవల విడుదలైన ఈ చిత్ర తెలుగు ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి, సినీ విమర్శకుల నుంచి విశేష స్పందన లభించింది. ప్రస్తుతం అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారతీయ చిత్రాల జాబితాలో అగ్రస్థానంలో నిలిచిన ‘జి.డి.నాయుడు’ చిత్రం ఆగస్టు 7న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది.