GDN : సైలెంటుగా తెలుగులోకి మాధవన్ G D నాయుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘ప్రతిష్టాత్మక బయోపిక్‌లు అనగానే గుర్తుకొచ్చే అతికొద్ది మంది నటుల్లో ఆర్. మాధవన్ ఒకరు. ‘రాకెట్రి: ది నంబి ఎఫెక్ట్’ చిత్రంతో భారతీయ అంతరిక్ష శాస్త్రవేత్త కథను ఆవిష్కరించి జాతీయ స్థాయిలో అభినందనలు అందుకున్న మాధవన్, ఇప్పుడు మరొక మహోన్నతమైన భారతీయ ఆవిష్కర్త జీవిత కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. నటుడు, దర్శకుడు కృష్ణకుమార్ రామకుమార్ కాంబినేషన్లో రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘జి.డి.నాయుడు’ (GDN). భారతీయ సాంకేతిక రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన ప్రముఖ శాస్త్రవేత్త, ఆవిష్కర్త గోపాల స్వామి దొరైస్వామి నాయుడు (జి.డి.ఎన్) జీవిత ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ‘ఎడిసన్ ఆఫ్ ఇండియా’, ‘మిరాకిల్ మేన్’, ‘వెల్త్ క్రియేటర్ ఆఫ్ కోయంబత్తూర్’ అని ప్రసిద్ధి చెందిన ఆయన పోరాటం, శ్రమను వెండితెరపై ఆవిష్కరించే పాత్రలో మాధవన్ నటించారు.
ఈ సినిమాలో సత్యరాజ్, జయరామ్, ప్రియమణి, దుషారా విజయన్ మరియు వినయ్ రాయ్ కీలక పాత్రలలో మెరవనున్నారు. గోవింద్ వసంత అందించిన నేపథ్య సంగీతం ఈ పీరియాడికల్ డ్రామాకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. గతంలో నంబి నారాయణన్ పాత్ర కోసం ఎంతగానో కష్టపడిన మాధవన్, ఈ చిత్రం కోసం కూడా సరికొత్త మేకోవర్‌తో డిఫరెంట్ గెటప్స్‌లో కనిపించబోతున్నారు. ఈ చిత్ర నిర్మాణ విలువలు, నాచురల్ పీరియాడికల్ సెటప్ సినిమాపై అంచనాలను భారీగా పెంచాయి. ఇటీవల విడుదలైన ఈ చిత్ర తెలుగు ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి, సినీ విమర్శకుల నుంచి విశేష స్పందన లభించింది. ప్రస్తుతం అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారతీయ చిత్రాల జాబితాలో అగ్రస్థానంలో నిలిచిన ‘జి.డి.నాయుడు’ చిత్రం ఆగస్టు 7న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది.
Also Read
- Mouli: మైత్రీ మూవీ మేకర్స్.. 'దొంగ నా కొడుకు' రిలీజ్ డేట్ ఫిక్స్!
- Husharu 2: బీరు కోసం 'క్షీరసాగర మథనం'.. కల్ట్ సీక్వెల్లో షాకింగ్ మార్పులు: ‘హుషారు 2’ పోస్టర్ వెనుక కథేంటి?
- Kandregula Naidu: మాది 3.5 రేటింగ్ సినిమా, తొక్కేయకండి.. 'అనకాపల్లి' నిర్మాత ఆవేదన!
- Indraja: ఫేక్ సక్సెస్ మీట్లకు దూరంగా ఉంటా.. ఇంద్రజ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
తాజావార్తలు
-
Kishan Reddy : బతుకమ్మపై కిషన్ రెడ్డి పిలుపు.. మహిళలకు బిగ్ మెసేజ్.!
-
CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు.. అక్టోబర్ 27న కీలక విచారణ
-
Indian Air Force: కొత్త ఎయిర్‌ఫోర్స్ చీఫ్‌గా ఆశుతోష్ దీక్షిత్ నియామకం.. అక్టోబర్ 31న బాధ్యతలు
-
Mouli: మైత్రీ మూవీ మేకర్స్.. ‘దొంగ నా కొడుకు’ రిలీజ్ డేట్ ఫిక్స్!
-
WI Vs IND: వెస్టిండీస్‌తో మొదటి టీ20 మ్యాచ్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!