Pushpa 3: ఇక ఇప్పట్లో పుష్ప 3 లేనట్టే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన ‘పుష్ప 2’ (ది రూల్) 2024 డిసెంబర్ 5న విడుదలై బెంచ్‌మార్క్ రికార్డులు క్రియేట్ చేసింది. ఈ సినిమా విడుదలై ఏడాది పూర్తయిన సందర్భంగా, పుష్ప 3 (ది ర్యాంపేజ్) కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు నిరాశ ఎదురైంది. ‘పుష్ప 2’ రిలీజై ఏడాది పూర్తయినా, మేకర్స్ నుండి ‘పుష్ప 3′ గురించి ఎలాంటి ప్రస్తావన రాకపోవడం చర్చనీయాంశమైంది.’పుష్ప 2’ విడుదలై ఏడాది పూర్తయిన సందర్భంగా హీరో అల్లు అర్జున్ సోషల్ మీడియాలో ఎమోషనల్‌గా పోస్ట్ చేశారు. “పుష్పని జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను” అంటూ బన్నీ పోస్ట్ చేశారు. “అద్భుతమైన విజయం ఇచ్చిన ఆడియన్స్‌కు ఎప్పటికీ రుణపడి వుంటా” అని తెలిపారు. “సుకుమార్‌తో కలిసి వర్క్ చేయడం దక్కిన గౌరవంగా భావిస్తున్నా” అని పేర్కొన్నారు. అయితే, ఈ పోస్ట్‌లో ఎక్కడా ‘పుష్ప 3’ గురించి అల్లు అర్జున్ మాట్లాడలేదు. దర్శకుడు సుకుమార్ సైతం కేవలం ‘పుష్ప 2’ మేకర్స్ పోస్టర్‌ను మాత్రమే షేర్ చేశారు.
Also Read : Akanda 2 :’అఖండ 2’కి అడ్డంకి.. ఆది సాయికుమార్ ‘శంబాల’కు గోల్డెన్ ఛాన్స్?
Also Read
- Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
- Bobby Deol: అప్పటివరకు సరైన హిట్ లేదు.. ‘యానిమల్’తో ఓవర్‌నైట్ సెన్సేషన్.. ఇప్పుడు ఆ ఇమేజ్‌పై పోరాటం!
- Drishyam 4: జార్జ్‌కుట్టి కథకు మరో ట్విస్ట్.. ‘దృశ్యం 4’ను అధికారికంగా ప్రకటించిన మేకర్స్!
- Niu Lai Box Office: స్టార్లు లేరు.. భారీ బడ్జెట్ లేదు.. అయినా రూ.కోట్ల వసూళ్లు! ఈ చిన్న సినిమా రచ్చ మామూలుగా లేదుగా..
‘పుష్ప 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో “బన్నీ కెరీర్‌లో మూడేళ్లు వేస్ట్ చేశా, ఇంకో మూడేళ్లు ఇస్తే పుష్ప 3 తీస్తా” అని సుకుమార్ ఫ్యాన్స్‌కు చెప్పడం, ‘పుష్ప 2’ థ్యాంక్స్ మీట్లో ‘పుష్ప 3’ కథేమిటో నాకు, సుకుమార్‌కు తెలీదు అని అల్లు అర్జున్ చెప్పడం. “అద్భుతంగా వుంటుందనిపిస్తోంది గానీ.. పరిస్థితులు కుదిరే వరకు వెయిట్ చేద్దాం” అని అనడంతో వెంటనే ఆ సినిమా ఉంటుందని అందరూ అనుకున్నారు. ‘పుష్ప 2’ (2024). ‘పుష్ప 1’ (2021) మధ్య మూడేళ్ల గ్యాప్ వచ్చింది. ఈ లెక్కన ‘పుష్ప 3’ (ది ర్యాంపేజ్) ఇప్పట్లో రావడం కష్టమే అని తెలుస్తోంది. దీనికి ప్రస్తుత పరిణామాలు మరింత బలం చేకూరుస్తున్నాయి.
Also Read : Undavalli Arun Kumar: పవన్ కల్యాణ్ సీఎం అవుతాడని నమ్మా.. ఇలాంటి వ్యాఖ్యలు దురదృష్టకరం..
సుకుమార్ ‘పుష్ప 2’ తర్వాత రామ్ చరణ్‌తో సినిమా చేయనున్నారు. ఏడాది నుంచి ఈ కథ రెడీ అవుతోంది. ఈ సినిమా 2026 సమ్మర్‌లో సెట్స్‌పైకి వెళ్లి, దాదాపు రెండేళ్లపాటు సెట్స్‌పైనే ఉండే అవకాశం ఉంది. బన్నీ ప్రస్తుతం తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో నటిస్తున్నారు. ఆయన ఇతర తమిళ దర్శకులు చెబుతున్న కథలు కూడా వింటున్నారు. ఈ పరిస్థితులు చూస్తుంటే, ‘పుష్ప 3’ రాక కోసం అభిమానులు 2028 వరకు ఎదురుచూడాల్సి వస్తుందని నిర్మాత చెప్పిన మాటల్లో నిజం ఉన్నట్లు కనిపిస్తోంది. అందుకే ‘పుష్ప 2’ ఏడాది పూర్తయిన సందర్భంగా అల్లు అర్జున్ కానీ, సుకుమార్ కానీ ‘పుష్ప 3’ గురించి మాట్లాడలేదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
తాజావార్తలు
-
Konda Surekha : కాంగ్రెస్ అధ్యక్షుడితో కొండా సురేఖ భేటీ.. కూతురి వ్యాఖ్యలపై ఖర్గే ఆరా
-
Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
-
NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
-
Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!