Pushpa 2 Japan Release: టోక్యోలో ‘పుష్ప 2’ ప్రీమియర్ ఈవెంట్.. జపనీస్‌లో డైలాగ్ చెప్పిన అల్లు అర్జున్!
- టోక్యోలో ‘పుష్ప 2: ది రూల్’ ప్రీమియర్ ఈవెంట్..
- జపనీస్ భాషలో ‘పుష్ప’ డైలాగ్ చెప్పిన అల్లు అర్జున్..
- ఈరోజు జపాన్ లో గ్రాండ్‌గా రిలీజ్ అయిన పుష్ప 2..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pushpa 2 Japan Release: జపాన్ రాజధాని టోక్యో నగరంలో నిర్వహించిన ‘పుష్ప 2: ది రూల్’ ప్రీమియర్ ఈవెంట్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులకు జీవితాంతం గుర్తుండిపోయే అనుభూతిని అందించాడు. ఈ కార్యక్రమంలో బన్నీ జపనీస్ లాంగ్వేజ్ లో ‘పుష్ప’ డైలాగ్ చెప్పగానే థియేటర్ మొత్తం ఒక్కసారిగా హర్షధ్వానాలు, చప్పట్లతో మారుమోగింది. ఫ్యాన్స్ విజిల్స్‌తో హాల్‌ను ఉర్రూతలూగించారు. కాగా, ఈ ప్రీమియర్‌కు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. జపాన్ ప్రేక్షకులు ఇండియన్ సినిమాలను ఎంతగా ఆదరిస్తున్నారో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. ముఖ్యంగా మాస్ యాక్షన్, స్టైలిష్ హీరోయిజం మూవీస్ అక్కడి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి.
Read Also: NTR- Neel Dragon Movie: ఇట్స్ అఫీషియల్.. డ్రాగన్ సినీమాలో బాలీవుడ్ సీనియర్ యాక్టర్
Also Read
కాగా, ‘పుష్ప 2: ది రూల్’ జపాన్‌లో ఈరోజు (జనవరి 16వ తేదీన) గ్రాండ్‌గా రిలీజ్ కు సిద్ధమవుతుంది. ప్రీమియర్ ఈవెంట్‌కు లభించిన అద్భుత స్పందన మూవీపై భారీగా అంచనాలు పెంచేశాయి. జపాన్‌లో ఈ చిత్రాన్ని ‘పుష్ప కున్రిన్’ పేరుతో రిలీజ్ అవుతుంది. ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థల సహకారంతో దాదాపు 250 థియేటర్లలో ఈ మూవీని ప్రదర్శించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఒక భారతీయ కమర్షియల్ సినిమా ఇంత పెద్ద స్థాయిలో జపాన్‌లో విడుదల కావడం సినీ వర్గాల్లో చర్చకు దారి తీసింది.
Read Also: Victory Venkatesh: మా ఆవిడను అలా పిలిచినందుకు తెగ ఫీలయ్యింది..!
అయితే, సినిమా ప్రమోషన్ల కోసం అల్లు అర్జున్ జపాన్ వెళ్లగా, అతడితో పాటు హీరోయిన్ రష్మిక మందన్న కూడా అక్కడే ఉంది. విమానాశ్రయంలోనే వీరికి అభిమానులు ఘనంగా స్వాగతం పలకడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇది ‘పుష్ప’ సిరీస్‌కు ఉన్న అంతర్జాతీయ క్రేజ్‌ను క్లిరియ్ గా చూపిస్తోంది. ఇక, ఇప్పటికే ‘పుష్ప 2: ది రూల్’ భారత్‌తో పాటు విదేశీ మార్కెట్లలో భారీ వసూళ్లను రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీకి సుమారు రూ.1800 కోట్లకు పైగా వచ్చినట్లు సమాచారం. అల్లు అర్జున్ యాక్టింగ్, స్టైలిష్ లుక్, పాటలు, మాస్ ఎలిమెంట్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.
Read Also: Trump-Machado: ట్రంప్‌తో మచాడో భేటీ.. నోబెల్ శాంతి బహుమతి అందజేత
ఇక, ‘పుష్ప 2’ తర్వాత అల్లు అర్జున్ నెక్ట్స్ సినిమాపై దృష్టి పెట్టారు. ప్రముఖ తమిళ దర్శకుడు అట్లీతో చేయబోయే ప్రాజెక్ట్ ఇప్పటికే భారీ అంచనాలను క్రియేట్ చేస్తుంది. ఈ మూవీలో హీరోయిన్‌గా దీపికా పడుకోణె నటించబోతున్నట్లు తెలుస్తుంది. ఈ పవర్‌ఫుల్ కాంబినేషన్‌పై ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వేచి చూస్తున్నారు.
Konnichiwa, Japan 🇯🇵
Icon Star @alluarjun stuns the audience by delivering his #Pushpa2 Japanese dialogue at the Tokyo premiere 🔥
Receiving huge cheers and thunderous applause from the crowd 👏Grand release in Japan on January 16th 💥💥#Pushpa2#WildFirePushpa… pic.twitter.com/dm5kEECMT7
— Pushpa (@PushpaMovie) January 15, 2026
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్‌తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్‌పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్‌కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!