అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సెకండ్ పార్ట్ ఖాతాలో మరో రికార్డు నమోదయింది. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా పుష్ప మొదటి భాగంతో పాటు రెండో భాగం రూపొందించిన సంగతి తెలిసిందే. మొదటి భాగమే అనేక రికార్డులు కొల్లగొట్టగా సెకండ్ పార్ట్ రిలీజ్ అయిన తర్వాత మరెన్నో రికార్డులు బద్దలు కొట్టి టాలీవుడ్ లో సైతం ఎన్నో రికార్డులు సృష్టించింది.
Also Read:Kannappa : కన్నప్పకు సెన్సార్ అభ్యంతరాలు..?
అయితే ఇప్పుడు మరో రికార్డ్ పుష్ప 2 పేరిట నమోదయింది. అదేంటంటే ఇప్పటి వరకు మూడు వెన్నడూ లేని విధంగా హిందీలో ఈ సినిమా 5.1 టివిఆర్ (టీఆర్పీ) రేటింగ్ సాధించింది. ఇక అలా ఈ సినిమా ఏకంగా 5.4 కోట్ల రీచ్ సాధించింది. అంతే కాదు ఈ సినిమాకి సంబంధించిన రీలోడెడ్ వెర్షన్ జూన్ 29న జీ సినిమా టెలికాస్ట్ కానుంది.
Also Read:Kagiso Rabada: జట్టుకోసం రక్తాన్ని ఇవ్వడానికైనా సిద్ధం.. దక్షిణాఫ్రికా బౌలర్ భావోద్వేగం..!
ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటించగా సునీల్, అనసూయ, ఫహద్ ఫాజిల్ వంటి వారు ఇతర కీలక పాత్రలలో నటించారు. ఇక ఈ సినిమాకి సీక్వెల్ కూడా ఉండనుంది. అయితే అల్లు అర్జున్, సుకుమార్ వేర్వేరు ప్రాజెక్టులలో బిజిగా ఉండడం కారణంగా ఆ సినిమా పట్టాలెక్కేందుకు ఇంకా ఆలస్యం అయ్యే అవకాశం ఉంది.