Kannappa : మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా వస్తున్న కన్నప్ప మూవీపై అంచనాలు క్రమంగా పెరుగుతున్నాయి. ట్రైలర్ తర్వాత దీనిపై మంచి అభిప్రాయాలు కొంత వరకు ఏర్పడుతున్నాయి. ఇలాంటి టైమ్ లో మూవీ మళ్లీ కొత్త చిక్కుల్లో పడ్డట్టు తెలుస్తోంది. ఇందులో పిలక, గిలక పాత్రలు బ్రాహ్మణులను అవమానించడానికే పెట్టారంటూ బ్రాహ్మణ చైతన్య వేదిక ఇప్పటికే కోర్టులో పిటిషన్ వేసింది. దానిపై నేడు ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సెన్సార్ బోర్డు స్క్రూటినీ జరగకుండా రిలీజ్ డేట్ ఎలా చెప్తారని ఆగ్రహం వ్యక్తం చేసింది.
Read Also : Samantha: ముంబైలో ఫోటోగ్రాఫర్లపై సమంత అసహనం
సెన్సార్ పూర్తయిన తర్వాతనే రిలీజ్ చేయాలని.. పర్మిషన్ లేకుండా రిలీజ్ చేయొద్దంటూ తేల్చేసింది. దీంతో తాజాగా సెన్సార్ బోర్డు సభ్యులు కన్నప్ప మూవీని చూశారంట. అందులోని కొంత మందికి 13 సీన్లు నచ్చలేదని తెలుస్తోంది. వాటిపై అభ్యంతరాలు వ్యక్తం చేశారంట. అవి వివాదాలకు కేంద్ర బిందువు అవుతాయని.. కాబట్టి తీసేస్తే బెటర్ అని సూచించారంట.
దీనిపై ఇప్పటి వరకు మంచు విష్ణు స్పందించలేదు. కాగా మూవీ గురించి రకరకాలుగా ప్రచారం జరుగుతోంది. తాము ఎవరినీ అవమానించలేదని.. వేద పండితుల సలహాలతోనే మూవీని తీశాం అని విష్ణు ఇప్పటికే చెప్పుకొస్తున్నాడు. ఎవరి మనోభావాలు దెబ్బతీసేలా తాము మూవీని తీయలేదంటున్నాడు. మరి సెన్సార్ బోర్డు ఏం చేస్తుందో చూడాలి.
Read Also : Raja Saab – Peddi -War-2 : ప్రభాస్, చరణ్, ఎన్టీఆర్.. ఎవరి సత్తా ఏమిటో?