ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, బ్రిలియంట్ దర్శకుడు సుకుమార్ సన్సేషన్ కలయికలో రాబోతున్న చిత్రం పుష్ప -2. ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేమికులు ఎదురుచూస్తున్న ఈ చిత్రం ఒకరోజు ముందుగానే అంటే డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. మైత్రీమూవీ మేకర్స్ అసోసియేషన్ విత్ సుకుమార్ రైటింగ్స్‌తో నిర్మాణం జరుపుకుంటున్న ఈ చిత్రానికి నవీన్ ఎర్నేని. వై.రవిశంకర్ నిర్మాతలు. ఈ చిత్రం విడుదల తేదిని తెలియజేయడానికి గురువారం హైదరాబాద్‌లో గ్రాండ్‌గా ప్రెస్‌మీట్‌ను ఏర్పాటు చేశారు. సమావేశంలో ఈ చిత్రాన్ని ఇండియా వైడ్ పంపిణీ చేస్తున్న నిర్మాతలు కూడా పాల్గొన్నారు. సమావేశంలో నిర్మాత నవీన్ యెర్నేని మాట్లాడుతూ, “పుష్ప-2 రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడానికి ఈ ప్రెస్ మీట్ పెట్టాము.
Pushpa 2 The Rule: మెగా ఫ్యామిలీతో విభేదాలు.. పుష్ప 2పై ప్రభావం చూపిస్తాయా ?
మేము ఇంతకు ముందు చెప్పిన దాని కన్నా ఒక రోజు ముందుగా, అంటే డిసెంబర్ 5 న ప్రేక్షకుల ముందుకు వస్తున్నాం. పుష్ప-2 కచ్చితంగా ఒక పెద్ద సినిమా గా మారింది. రిలీజ్ కూడా ఘనంగా ప్లాన్ చేస్తున్నాం. ఈ సినిమా అందరి అంచనాలకు మించి ఉండబోతుంది అన్నారు. అయితే సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్ గురించి ఒక మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు సమాధానంగా నవీన్ ఎర్నేని అసలు విషయం చెప్పారు. ఈ సినిమాకి సంబంధించిన నాన్ థియేట్రికల్ రైట్స్ అంటే సాటిలైట్ తో పాటు డిజిటల్ రైట్స్ అన్ని భాషలకు కలిపి 420 కోట్లకు జరిగిందని చెప్పుకొచ్చారు. దీంతో అల్లు అర్జున్ అభిమానులందరూ ఇది సార్ పుష్ప గాడి రేంజ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఒక రకంగా ఇది రికార్డు స్థాయి బిజినెస్ అని చెప్పొచ్చు. మల్టీ స్టారర్ కాకుండా సింగిల్ హీరో నటిస్తున్న సినిమాకి ఈ రేంజ్ కేటాయించడం మామూలు విషయం కాదు అంటున్నారు.