NTV Telugu Site icon

Pushpa -2 : సౌత్ ఇండియా నం-1 గా నిలిచిన ‘కిస్సిక్’ సాంగ్

Kissik

Kissik

ఐకాన్‌ స్టార్‌ కథానాయకుడిగా బ్రిలియంట్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ దర్శకత్వంలో వస్తున్న సినిమా పుష్ప -2.  సుకుమార్‌ రైటింగ్స్‌ అసోసియేషన్‌తో మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్‌ ఈ ప్రెస్టేజియస్‌ ఇండియన్‌ ప్రాజెక్ట్‌ను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. డిసెంబర్‌ 5న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రంపై అంచానాలు తారాస్థాయిలో వున్నాయి. సినిమాలో కంటెంట్‌ కూడా అంతకు మించి అస్సలు తగ్గేదేలా అనే విధంగా వుండబోతుంది.

Also Read : Allu Arjun : పుష్ప – 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ కు పర్మిషన్ వచ్చేసింది.. ఎక్కడంటే..?

ఇక పుష్ప ది రైజ్‌ చిత్రంలో మాదిరిగానే ఈ సెకండ్ పార్ట్ లోను స్పెషల్ సాంగ్ ను ప్లాన్ చేసాడు సుకుమార్. ఈ సాంగ్ లో అల్లు అర్జున్ తో శ్రీలీల స్టెప్పులేయన్నున్న సంగతి తెలిసిందే. ఈ ఆదివారం చెన్నైలో జరిగిన ప్రీరిలీజ్ ఈవెంట్ లో ఈ కిస్సిక్’ లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేసారు మేకర్స్. మరోవైపు ఈ సాంగ్ సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేస్తోంది. రిలీజ్ అయిన కేవలం 18 గంటల్లో 25 మిలియన్ వ్యూస్ రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ వ్యూస్ తో సౌత్ ఇండియాలో ఎక్కువ మంది చూసిన సాంగ్ గా ‘కిస్సిక్’ రికార్డు సాధించింది. ఇప్పటి వరకు సౌత్ ఇండియాలో ఎక్కువ మంది చూసిన సాంగ్ గా తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన గోట్ సినిమాలోని ‘విజిల్ పోడు’ టాప్ -1 గా కొనసాగుతుంది. ఈ సాంగ్ 24 గంటల్లో 24. 88 మిలియన్ వ్యూస్ రాబట్టింది. ఈ రికార్డును అతి తక్కవ కాలంలో బ్రేక్ చేసింది కిస్సిక్. కేవలం తెలుగు లిరికల్ సాంగ్ వ్యూస్ తో ఈ రికార్డు క్రియేట్ చేయడం విశేషం

Show comments