Pushpa -2 : గత పదేళ్లలో ఇలా జరగడం మొదటిసారి : మైత్రీ రవి
- బన్నీ, సుకుమార్ ల సెన్సేషన్ పుష్ప -2
- పాట్నా చరిత్రలో బిగ్గెస్ట్ ఈవెంట్ గా రికార్డు
- అదరగొట్టిన పుష్ప -2 ట్రైలర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన చిత్రం పుష్ప -2. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్ర ట్రైలర్ గత ఆదివారం బీహార్ రాజధాని పాట్నాలో లాంచ్ చేయడం జరిగింది. దేశంలోనే అతిపెద్ద సినిమా అయిన పుష్ప 2 ట్రైలర్ లాంచ్ కూడా దేశంలోని అతిపెద్ద ఈవెంట్ కావడం మరింత విశేషం. దేశంలోనే ఎన్నడూ లేనివిధంగా సుమారు మూడు లక్షల మందికి పైగా ఓ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరగడం ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇది పాట్నా చరిత్రలో ఎన్నడు జరగని పెద్ద ఈవెంట్ గా కొత్త రికార్డు సృష్టించింది.సుమారు 900 మంది పోలీసులు, 300 మంది ప్రైవేట్ సెక్యూరిటీ వ్యక్తుల మధ్య ఈ ఈవెంట్ జరగటం విశేషం.
Also Read : Actress Kasturi : అరెస్టుకు ముందు వీడియో రికార్డు చేసిన కస్తూరి
Also Read
ఈ సందర్భంగా మైత్రి మూవీ మేకర్స్ నవీన్ మాట్లాడుతూ “పాట్నా ప్రజలందరికీ నమస్కారం. ఇంతటి అభిమానాన్ని మేము పాట్నా నుండి అస్సలు ఊహించలేదు. ఒకరికి వచ్చిన ప్రతి ఒక్కరికి మా ధన్యవాదాలు. ఈ చిత్రం ఇంతటి విజయవంతమైన ప్రయాణం కావడానికి ముఖ్య కారణం స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్.
మైత్రి మూవీ మేకర్ రవి మాట్లాడుతూ “మేము ఇప్పటికీ ఎన్నో చిత్రాలను చేశాము. ఎన్నో ఈవెంట్స్ కూడా చేశాము. కానీ ఒక ట్రైలర్ను ఇలా విడుదల చేయడం అనేది మొదటిసారిగా జరుగుతుంది. పాట్నా నుండి ఇంతటి అభిమానాన్ని మేము ఊహించలేదు. వచ్చిన ప్రతి ఒక్కరికి మా ధన్యవాదాలు. డిసెంబర్ 5తేదీన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. గత పది సంవత్సరాల్లో ఇంతటి పెద్ద ఈవెంట్ చూడటం ఇదే తొలిసారి” అన్నారు
తాజావార్తలు
-
Hide & Silk: సుహాస్ కొత్త సినిమా టైటిల్ ఇదే!
-
India Post GDS Result 2026: జీడీఎస్ 1వ మెరిట్ లిస్ట్ విడుదల.. రాష్ట్రాల వారీగా PDF డౌన్లోడ్ చేసుకోండి
-
Jr. Doctors Protest : నెలకు రూ.5 వేలేనా? వైద్యుల ఆందోళన.. సిరిసిల్లలో ఓపీ బంద్.!
-
AP Municipality Reservations 2026: మున్సిపల్ ఎన్నికలకు కీలక అప్డేట్.. 106 పట్టణాలకు రిజర్వేషన్లు ఖరారు.. పూర్తి జాబితా ఇదే!
-
Bloody Romeo: నాని ‘బ్లడీ రోమియో’.. షూటింగ్ డేట్ ఫిక్స్!
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!