అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప 2 సినిమా ఎట్టకేలకు రిలీజ్ రెడీ అవుతుంది. సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ మీద ఈ సినిమాని భారీ బడ్జెట్ తెరకెక్కించారు. రష్మిక హీరోయిన్గా నటించిన ఈ సినిమా డిసెంబర్ ఐదో తేదీన రిలీజ్ అవుతుంది. ఈ నేపథ్యంలోనే సినిమా ప్రమోషన్స్ లో వేగం పెంచింది సినిమా యూనిట్. ఇక తాజాగా ఈ సినిమాకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యాయి. అడ్వాన్స్ బుకింగ్స్ లో కూడా పుష్ప 2 ఒక రేంజ్ లో దూసుకుపోతోంది. ఈ రోజు సాయంత్రం ఐదు గంటల వరకు హిందీలో దాదాపు 12,500 టికెట్లు కేవలం పివిఆర్ ఐనాక్స్ ద్వారా బుక్ అయినట్లు తెలుస్తోంది.
Trisha : 40 ప్లస్‌లో సత్తా చాటుతున్న ‘త్రిష’
మూడు గంటల వ్యవధిలో ఈ టికెట్లు బుక్ అయినట్లుగా చెబుతున్నారు. ఇక జొమాటో ప్రారంభించిన డిస్ట్రిక్ట్ అనే యాప్ లో కూడా బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. దాంతో పాటు బుక్ మై షో లో కూడా బుకింగ్ ఓపెన్ అయ్యాయి. దాదాపుగా అనేక రికార్డులను బద్దలు కొడుతూ ఈ అడ్వాన్స్ బుకింగ్స్ దూసుకుపోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమాని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఏకకాలంలో రిలీజ్ చేస్తున్నారు. ముఖ్యంగా నైజాం ప్రాంతంలో ఇప్పటికే టికెట్ రేట్లు పెంచి అమ్ముకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ టికెట్ రేట్ ల గురించి అనేక రకాలు చర్చలు జరుగుతున్నాయి. సాధారణ ప్రజలు చూసే విధంగా లేవని కామెంట్స్ వినిపిస్తుండగా సినిమా బడ్జెట్ ప్రకారం భారీగా ఖర్చుపెట్టి తీశారు కాబట్టి ఆ మాత్రం రేట్లు పెట్టకపోతే కష్టమే అంటున్నాయి సినీవర్గాలు.