ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రియేటివ్ జీనియస్ సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసిన సంగతి తెలిసిందే. తెలుగులో కన్నా నార్త్ బెల్ట్ లో రికార్డు కలెక్షన్స్ వసూలుచేసింది. పుష్పకు కొనసాగింపుగా రాబోతున్న పాన్ ఇండియా సినిమా పుష్ప -2. బన్నీ సరసన రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించగా.. మలయాళ స్టార్ ఫహద్ ఫాసిల్ కీలక పాత్ర చేస్తున్నారు. ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించి ఓ క్రేజీ అప్డేట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. అది ఏమిటంటే ఈ చిత్రంలోని ఐటమ్ సాంగ్ కు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్.
Also Read: Double Ismart : రిలీజ్‌కు రెండు రోజులు.. ఎటూ తెగని డబుల్ ఇస్మార్ట్ పంచాయతీ..?
బన్నీ- సుక్కు కాంబినేషన్ లో ఐటెం సాంగ్ కు క్రేజ్ ఏ విధంగా ఉంటుందో ఆర్య, ఆర్య – 2లో చూసాం. మరి ముఖ్యంగా పుష్ప పార్ట్ 1 లోని ‘ఊ అంటావా మావా ‘ ఎంత పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిందో చెప్పక్కర్లేదు. అదే విధంగా పుష్ప – 2 లో స్పెషల్ ఐటెం సాంగ్ ప్లాన్ చేస్తున్నాడట సుక్కు. ఈ సారి ఐటెం సాంగ్ లో 60 ఏళ్ల సీనియర్ భామ మీనాక్షీ శేషాద్రిని చూపించబోతున్నాడట లెక్కల మాస్టారు. ఆపద్భాందవుడు సినిమాలో చిరంజీవికి జోడిగా నటించింది మీనాక్షి శేషాద్రి. ఈ 60 ఏళ్ళ సుందరి దశాబ్ద కాలంగా సినిమాలకు దూరంగా ఉంది. ఇప్పుడు పుష్ప -2 లో స్పెషల్ సాంగ్ తో రీఎంట్రీకి సిద్ధం అయినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి అధికారక ప్రకటన రావాల్సి ఉంది. మరి సుకుమార్ ఈ 60 ఏళ్ల సుందరిని ఐటెం సాంగ్ లో ఏ విధంగా చూపిస్తాడో చూడాలి.