బాలీవుడ్ స్టార్ హీరోయిన్, గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా తన నిక్ జోనస్ తో కలిసి న్యూయార్క్ నగరంలో నివాసం ఉంటున్న విషయం తెలిసిందే. హాలీవుడ్ లో తన తొలి టీవీ షో ‘క్వాంటికో’ ద్వారా వార్తల్లో నిలిచిన ఈ హాట్ బ్యూటీ ఇప్పుడు పలు వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంది. పాప్ స్టార్ నిక్ జోనస్ ను వివాహం చేసుకున్న ఈ భామ యూఎస్ లో అత్యంత ఖరీదైన బంగ్లా కొని సంచలనం సృష్టించింది. అయితే ఈ బ్యూటీ అక్కడితో ఆగిపోలేదు… తాజాగా న్యూయార్క్ లో ఇండియన్ రెస్టారెంట్ ను కూడా ఓపెన్ చేసింది.
Read Also : వైట్ డ్రెస్ లో ప్రియాంక చోప్రా… “హ్యాపీ ప్రైడ్” అంటూ పోస్ట్
ఈ రెస్టారెంట్ కు ‘సోనా’ అనే పేరును పెట్టింది. రెస్టారెంట్ ను ప్రారంభించిన విషయాన్నీ ప్రియాంక తన ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. “3 సంవత్సరాల ప్రణాళిక, శ్రమ తరువాత ఫలించింది” అంటూ పిక్స్ ను షేర్ చేసింది. ఈ పిక్స్ చూస్తుంటే… రెస్టారెంట్ మొత్తం ఇండియన్ ఇంటీరియర్ డిజైన్ తో రూపొందించినట్టు కన్పిస్తోంది. ఇక ఈ పిక్స్ లోనే ప్రియాంక తన స్నేహితురాళ్ళతో కలిసి పానీపూరి తింటూ కన్పించారు. ఈ ఫొటోలో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.