The Goat Life: మార్చి 28న పాన్ ఇండియా రిలీజ్ కు సిద్దమైన పృథ్వీరాజ్ సుకుమారన్ “ది గోట్ లైఫ్”
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్న “ది గోట్ లైఫ్” (ఆడు జీవితం) సినిమా ఎక్స్ క్లూజివ్ వెబ్ సైట్ ను లాంఛ్ చేశారు మూవీ టీమ్. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ఈ సినిమాను వరల్డ్ క్లాసిక్ మూవీ “లారెన్స్ ఆఫ్ అరేబియా”తో పోల్చారు. “ది గోట్ లైఫ్” (ఆడు జీవితం) సినిమా ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేస్తుందని ఏఆర్ రెహమాన్ చెప్పారు. ఈ ఆస్కార్ విన్నర్ సంగీతాన్ని అందించిన “ది గోట్ లైఫ్” (ఆడు జీవితం) సినిమా ఆడియో రిలీజ్ ఈవెంట్ ను మార్చి 10న గ్రాండ్ గా నిర్వహించబోతున్నారు. సినిమా మార్చి 28న “ది గోట్ లైఫ్” (ఆడు జీవితం) పాన్ ఇండియా స్థాయిలో మలయాళంతో పాటు హిందీ, తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో థియేటర్స్ లోకి రాబోతోంది.
Also Read: Andrea Jeremiah : అలవాటు పడిపోయా.. ఇక పెళ్లొద్దంటున్న హీరోయిన్
Also Read
“ది గోట్ లైఫ్” (ఆడు జీవితం) సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ తో పాటు హాలీవుడ్ యాక్టర్ జిమ్మీ జీన్ లూయిస్, అమలాపాల్, కేఆర్ గోకుల్, అరబ్ ఫేమస్ యాక్టర్స్ తాలిబ్ అల్ బలూషి, రిక్ ఆబే ఇతర కీలక పాత్రల్లో నటించారు. బెన్యామిన్ రాసిన గోట్ డేస్ నవల ఆధారంగా ఈ సినిమాను అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ బ్లెస్సీ రూపొందించారు. విజువల్ రొమాన్స్ బ్యానర్ “ది గోట్ లైఫ్” (ఆడు జీవితం) సినిమాను మలయాళ చిత్ర పరిశ్రమలో ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ గా భారీ బడ్జెట్ తో నిర్మించింది.
ఈ సినిమాను ఒక యజ్ఞంలా పూర్తిచేశారు మూవీ టీమ్. ఎడారి లొకేషన్స్ ప్రతికూల వాతావరణాన్ని తట్టుకుంటూ అరుదైన లొకేషన్స్ లో చిత్రీకరణ జరిపారు. కోవిడ్ పాండమిక్ ను కూడా ఎదుర్కొని బెస్ట్ ఔట్ పుట్ తీసుకొచ్చారు. పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని “ది గోట్ లైఫ్” (ఆడు జీవితం) ఇవ్వనుంది.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!