ఈమధ్య అన్ని భాషలకు చెందిన హీరోలు హీరయిన్లు పెళ్లి చేసుకుని ఒక ఇంటి వారు అవుతున్నారు. మొన్నే రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి చేసుకోగా ఇప్పుడు మరో హీరోయిన్ తాప్సీ కూడా పెళ్లికి రెడీ అవుతోంది. ఇదిలా ఉండగా తాను పెళ్లి చేసుకోవాలని అనుకోవట్లేదని హీరోయిన్ ఆండ్రియా జెర్మియా చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి. తమిళనాడులో పుట్టిన ఆమె ముందు సింగర్ గా తన కెరీర్ ప్రారంభించింది.. ఆ తర్వాత గట్టిగా మారి అనేక సినిమాలలో నటించింది. 2005లో అతిధి పాత్రలు చేస్తూ నటన మొదలుపెట్టిన ఆమె తర్వాత హీరోయిన్గా కూడా కొన్ని సినిమాలు చేసింది. ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ తనకు 25 ఏళ్లు ఉన్నప్పుడు పెళ్లి ఆలోచన వచ్చింది కానీ ఎందుకో అప్పుడు చేసుకోవడం కుదర లేదు.
Also Read; Devil : ఓటీటీలోకి వచ్చేస్తున్న పూర్ణ నటించిన హారర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
ఇప్పుడు నా వయసు 40 కాబట్టి ఇక ఇప్పుడు వివాహం చేసుకోవాలని అనుకోవటం లేదు. అయినా నేను పెళ్లి చేసుకోకపోయినా సంతోషంగానే ఉంటా ఎందుకంటే ఒంటరి జీవితానికి అలవాటు పడిపోయానని చెప్పారు. అయినా పెళ్లి చేసుకున్న వాళ్లు ఎంతమంది సంతోషంగా ఉన్నారని ఆమె ఎదురు ప్రశ్నిస్తోంది. ఆండ్రియా గతంలో మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్‌తో ఆండ్రియా డేటింగ్ చేసినట్లు ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే అప్పట్లో అనిరుధ్‌ని ముద్దు పెట్టుకున్న ఫొటో ఒకటి అప్పట్లో వైరల్ కూడా అయింది. అయితే ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు గానీ వారిద్దరి మధ్య దూరమైతే పెరిగింది. అప్పుడు వీరిద్దరి ఫోటోలు మాత్రమే కాదు చాలామంది ఫోటోలు బయటకు వచ్చాయి. ఇటీవల విడుదలై ‘సైంధవ్’ మూవీలో ఆండ్రియా ఒక కీలక పాత్రలో నటించింది. అలాగే ఈమె నటించిన ‘పిశాచి 2’ మూవీ త్వరలో థియేటర్లలోకి రానుంది.