Prithviraj Sukumaran : దర్శక ధీరుడు రాజమౌళి ,సూపర్ స్టార్ మహేష్ కాంబినేషన్ లో బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ మూవీ తెరక్కుతుంది.మహేష్ తాజాగా ఈ ఏడాది గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చి మంచి విజయం సాధించాడు..తన తరువాత సినిమాను రాజమౌళితో ప్రకటించడంతో మహేష్ ఫ్యాన్స్ ఎంతో ఖుషీగా వున్నారు.ఈ సినిమాను దుర్గ ఆర్ట్స్ బ్యానర్ పై కే ఎల్ నారాయణ ఎంతో గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతుంది.మేకర్స్ త్వరలోనే ఈ సినిమాను అధికారికంగా అనౌన్స్ చేయనున్నారు.దర్శక ధీరుడు రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ వైడ్ ఎంతో పాపులర్ అయ్యారు.హాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ సైతం రాజమౌళి డైరెక్షన్ ను ఎంతగానో ప్రశంసించారు.
ప్రస్తుతం రాజమౌళి మహేష్ తో ఓ బిగ్గెస్ట్ అడ్వెంచరస్ మూవీ తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాను తన గత సినిమాల కంటే మరింత భారీగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను ఆఫ్రికా అడవుల్లో గ్రాండ్ విజువల్స్ తో షూట్ చేస్తారని సమాచారం.ఈ సినిమా కోసం పలువురు హాలీవుడ్ టెక్నీషియన్స్ కూడా పనిచేస్తున్నట్లు తెలుస్తుంది.అయితే ఈ సినిమా కాస్టింగ్ గురించి ఎలాంటి న్యూస్ లేకపోయినా మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.పృథ్వీరాజ్ సుకుమారన్ రీసెంట్ గా ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించిన సలార్ సినిమాలో అద్భుతంగా నటించి మెప్పించాడు.మరి రాజమౌళి సినిమా ఆఫర్ గురించి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.మరి ఈ విషయంపై చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించాల్సి వుంది.