Prisha Singh Comments on Her Wildlife Photography: అల్లు శిరీష్ కథానాయకుడిగా శామ్ ఆంటోన్ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘బడ్డీ’ సినిమాతో ప్రిషా సింగ్ హీరోయిన్‌గా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఈ సందర్భంగా ప్రిషా సింగ్ మాట్లాడుతూ నా ఫొటోలను చూసి ఆడిషన్‌కు పిలిచారు, సెలక్ట్ అయ్యా అని చెప్పుకొచ్చింది. అయితే సెలెక్ట్ అయ్యాక పాత్రలోని వేరియేషన్స్ చూసి నేను చేయగలనా! అని కూడా ఆలోచించా,కానీ హ్యాపీగా చేసేశానని అన్నారు. బడ్డీ చిత్రంలో నేను ఎయిర్ హోస్టెస్ పాత్రలో కనిపిస్తా, అందుకోసం నేను చాలా మంది ఎయిర్ హోస్టెస్‌ను గమనించానని అన్నారు. వారెలా నడుస్తారు.. ఎలా మాట్లాడుతారు, ఇతరులతో ఎలా ప్రవర్తిస్తారు వంటి విషయాలను గమనించాను. ఈ క్రమంలో డైరెక్టర్ ఎయిర్ హోస్టస్ పాత్ర చేయటానికి నాకు కొన్ని రెఫరెన్స్‌లనిచ్చారు అవి కూడా బాగా ఉపయోగపడ్డాయి.
Bandi Saroj Kumar: చిరంజీవిని చిరంజీవి అనే పిలుస్తా.. గారు అని పిలవను!
టాలీవుడ్లో నటించటం నటిగా నాకొక మంచి ఎక్స్‌పీరియెన్స్. ఇంకా వైవిధ్యమైన పాత్రలు చేయటానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నానన్నారు. అంతేకాదు వైల్డ్ లైఫ్ ఫొటోగ్రఫీ అంటే ప్రిషకు అభిరుచి ఎక్కువట. తన ఇన్‌స్టాగ్రామ్‌లో రీసెంట్‌గా దీనికి సంబంధించిన ఫొటోలను షేర్ చేసిందామె. అడవుల్లో వైల్డ్ లైఫ్‌కు సంబంధించిన యాత్రికులతో కలిసి సఫారీల్లో వెళ్లి అక్కడి జంతువులను తన కెమెరాల్లో బంధిస్తుంటుందట. ‘వైల్డ్ లైఫ్ అంటే కేవలం జంతువులను, చెట్లకు సంబంధించిన ఫొటోలను కెమెరాల్లో బంధించటం మాత్రమే కాదు, వాటికి సంబంధించి సహజమైన భావోద్వేగాలను బంధించటమే అంటోంది ఆమె. అలాంటి విషయాలను నా కెమెరాలో బంధించినప్పుడు సంతృప్తిని, మంచి అనుభవాన్ని ఇస్తుంది. మనం కెమెరాలో బంధించే ప్రతి విషయానికి బలమైన కథ ఉంటుంది. నటన పరంగానూ ఇది నన్ను మెరుగుపరుచుకునేలా చేసింది. కెమెరా ముందు ధైర్యంగా నటించగలుగుతున్నానన్నారు.