NBK50 inTFI : ఒకే వేదికపై చిరు – బాలయ్య.. ఫ్యాన్స్ కు పూనకాలే..
- బాలయ్య సినీప్రయాణానికి 50 ఏళ్ళు
- ఎన్నో వైవిధ్యభరితమైన పాత్రల్లో మెప్పించిన బాలయ్య
- ఒకే వేదికపై బాలయ్య - చిరు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నందమూరి తారక రామారావు గారి కుమారునిగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు నందమూరి నటసింహం బాలకృష్ణ. 1974 లో ‘తాతమ్మ కల’ సినిమాతో నటుడిగా కెరీర్ ప్రారంభించిన ఆయన నేటికీ అగ్ర కథానాయకుడిగా కొనసాగుతున్నారు. సినీ పరిశ్రమలో నటుడిగా 50 ఏళ్లు పూర్తిచేసుకోవడంతో అటు సినీ పరిశ్రమ పెద్దలు, ఇటు అభిమానులు ప్రత్యేక వేడుకలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా తెలుగు చలన చిత్ర పరిశ్రమ సెప్టెంబర్ 1న బాలయ్య 50ఏళ్ళ స్వర్ణోత్సవాన్ని నిర్వహించేందుకు సిద్ధం అవుతుంది. తాజాగా దీనికి సంబంధించిన కర్టెన్ రైజర్ కార్యక్రమం ఫిలిం ఛాంబర్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బాలకృష్ణ సోదరులు నందమూరి రామకృష్ణ, నందమూరి మోహనకృష్ణ, డైరెక్టర్ బోయపాటి శ్రీను, వైవిఎస్ చౌదరి, పలువురు నిర్మాతలు, సినీ ప్రముఖులు పాల్గొన్నారు.
Also Read: Mr bachchan: గురూజీ క్యారక్టర్ తో అవమానించిన హరీష్.. ఎవరినో తెలుసా..
Also Read
- Sivakarthikeyan: ‘నీకు ఫ్యాన్స్ వేస్ట్’ అన్న నిర్మాతకు శివకార్తికేయన్ దిమ్మతిరిగే రిప్లై!
- Jim Jim Thara: లీకై వైరల్ అయిన ‘జిమ్ జిమ్ తార’ పాట వెనుక అసలు గుట్టు ఇదే!
- Chiranjeevi: మెగాస్టార్‌కు కార్తీక్ సుబ్బరాజ్ మార్క్ కథ నరేషన్.. కానీ హోల్డ్?
- Mythri Ravi: "రూ. 2 కోట్లతో తీస్తే రూ. 400 కోట్లా? మాకు ఇది చెంపపెట్టు"
కాగా, సెప్టెంబర్ 1న ఘనంగా నిర్వహించబోతున్న బాలయ్య గోల్డెన్ జూబ్లీ ఫంక్షన్ కు మొదటి ఆహ్వాన పత్రికను మెగాస్టార్ చిరంజీవికి అందజేశారు సినీ పెద్దలు. ఈ వేడుకలు HICC నోవటెల్ లో జరగనున్నాయి. 50 ఏళ్ల సినీ ప్రస్థానంలో 109 సినిమాలతో అలరించారు. తన నటనతో కోట్ల మంది అభిమానులను సొంతం చేసుకున్నారు నటసింహం. ఆదిత్య 369,భైరవద్విపం వంటి విభిన్న చిత్రాలతో ఆ పాత్రలకే ప్రాణం పోసాడు బాలయ్య. ఇటీవల అఖండ, వీర నరసింహ రెడ్డి సినిమాలతో భారీ విజయాలు అందుకున్న బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. అటు సామజిక సేవలోనూ ఎప్పుడు ముందుటారు బాలకృష్ణ. ‘బసవతారకం’ హాస్పిటల్ ద్వారా ఎంతో మందికి వైద్య సేవలు అందిస్తూ, తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ నటుడిగానే కాకుండా రాజకీయాల్లో కూడా సత్తా చాటుతున్నారు నందమూరి నటసింహం.
తాజావార్తలు
-
Aggipette Maccha : యూట్యూబ్ కమెడియన్ ‘అగ్గిపెట్టె మచ్చ’ మృతి..
-
Sivakarthikeyan: ‘నీకు ఫ్యాన్స్ వేస్ట్’ అన్న నిర్మాతకు శివకార్తికేయన్ దిమ్మతిరిగే రిప్లై!
-
BJP Posters: ‘బొద్దింకలా కాకుండా.. మచ్చర్లా ఉండు’.. పుణెలో వెలసిన బీజేపీ పోస్టర్లు
-
Harish Rao : 5,420 కోట్ల ‘ట్రూ అప్’ భారాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్
-
Poland: పోలాండ్ పాఠశాలలో దుండగుడు కత్తితో వీరంగం.. ఏడుగురికి గాయాలు
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!