స్వర్గీయ వై.యస్. రాజశేఖర్ రెడ్డి బయోపిక్ ‘యాత్ర’తో చక్కని విజయాన్ని అందుకోవడమే కాదు, దర్శకుడిగా మంచి గుర్తింపు కూడా తెచ్చుకున్నారు మహి వి రాఘవ. అదే సమయంలో ‘యాత్ర’కు సీక్వెల్ కూడా తీస్తానని ఆయన చెప్పారు. అయితే… ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల దగ్గర పడుతున్న సమయంలో ఈ సీక్వెల్ వస్తుందనేది అందరూ అనుకుంటున్న మాట. ఇప్పటికీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ తో బిజీగా ఉన్న మహి వి రాఘవ… ఈ సీక్వెల్ ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.యస్. జగన్ రాజకీయ జీవితంపై తీయబోతున్నారు.
Read Also : 35 ఏళ్ళ ‘అనసూయమ్మ గారి అల్లుడు’
ఇందులో వై.యస్ జగన్ పాత్రకు బాలీవుడ్ నటుడు, ‘స్కామ్ 1992’ ఫేమ్ ప్రతీక్ గాంధీని ఎంపిక చేశారట. దర్శకుడు మహి… ప్రతీక్ గాంధీని కలిసి, మూవీ స్టోరీని నెరేట్ చేయగానే, అతను ఇంప్రస్ అయ్యాడని, తప్పకుండా ఈ సినిమా చేస్తానని హామీ ఇచ్చాడని తెలుస్తోంది. ‘యాత్ర’ సీక్వెల్ రాజశేఖర్ రెడ్డి మరణానికి కొద్దికాలం ముందు నుండి జగన్ సీ.ఎం. అయ్యే వరకూ ఉంటుందట. తెలుగుదేశం పార్టీని ఓడించి, అధికార పీఠాన్ని హస్తగతం చేసుకున్న జగన్, ఒక్కసారిగా అన్ని వర్గాలలోనూ తనదైన ముద్రవేయడం ప్రారంభించారు. మరి వాటి ఫలితాలు వచ్చే ఎన్నికల్లో కూడా ఆయన్ని అధికార పీఠంపై నిలబెడతాయో లేదో తెలియదు కానీ ‘యాత్ర’ సీక్వెల్ ద్వారా జగన్ ప్రతిభను వెండితెర మీద మహి ఆవిష్కరించడం ఖాయంగా కనిపిస్తోంది.