Prakash Raj: యాక్టర్ శివాజీ చెత్తగా మాట్లాడాడు అని సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ మండిపడ్డారు. ఆడవాళ్ళ మీద ఈ అహంకారపు మాటలేంటి అని ప్రశ్నించారు. ఇది మీ ఆలోచనలో భాగం.. సంస్కారులు అనుకునే వాళ్లు వేదికల మీద మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని సూచించారు. ఇక, అనసూయకు నా మద్దతు ఉంటుంది.. అమ్మలు, చెల్లెళ్ల గురించి మాట్లాడే వాళ్ళు బుర్రలు అంత వరకే పని చేస్తాయని విమర్శలు గుప్పించారు.
Read Also: Indians Deportation: ఈ ఏడాది భారతీయులు బహిష్కరణకు గురైంది ఏ దేశం నుంచంటే..! వివరాలు ఇవే!
అయితే, మహిళలను కుసంస్కారంతో చూసే వాళ్లకు ఆడవాళ్ళ అవయవాలు మాత్రమే కనిపిస్తాయని యాక్టర్ ప్రకాష్ రాజ్ అన్నారు. ఐ బొమ్మ రవి దొంగతనం చేశాడు కాబట్టి, దొంగ దొంగే?.. జెనో ఫోభియాతో తీసే సినిమాల వెనుక విషం ఉందన్నారు. కుర్చీని నిలబెట్టుకోవడం కోసం చేసే ప్రయత్నాలు నిరంతరం జరుగుతుంటాయి.. ప్రజలు రాజకీయం చేయాలి.. పాలకులు పని చేయాలి కానీ రాజకీయం మన దగ్గర అది రివర్స్ అయిందని గుర్తు చేశారు. ఐదేళ్లకు వచ్చి వెళ్ళే వాళ్ళు.. ప్రజలు ఎవరు పర్మినెంట్?.. ఇదే ఇప్పుడు డిస్కషన్.. మీడియా కూడా సిగ్గు లేక అమ్ముడుపోయింది.. ఇండిపెండెంట్ మీడియా కొంత మేలు అని ప్రకాష్ రాజ్ పేర్కొన్నారు.