ఇండియన్ మైఖేల్ జాక్సన్ గా గుర్తింపు తెచ్చుకున్న యాక్టర్, డైరెక్టర్, కొరియోగ్రాఫర్ ప్రభుదేవా ప్రస్తుతం ‘పొన్ మాణిక్యవేల్’ చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. నటుడిగా ఇది అతనికి 50వ సినిమా. నివేదా పేతురాజ్ హీరోయిన్. ముగిల్ చెల్లప్పన్ దర్శకత్వంలో నిమీచంద్, హరీష్ ఈ సినిమాను ప్రొడ్యూసర్ చేశారు. తన కెరీర్ లోనే ప్రభుదేవా తొలిసారి పోలీస్ ఆఫీసర్ పాత్ర చేసిన ఈ మూవీని గత యేడాది ఫిబ్రవరిలోనే విడుదల చేయాలని అనుకున్నారు. ఆ తర్వాత మార్చి 6కు వాయిదా వేశారు. అప్పుడూ విడుదల కాలేదు. ఆ పైన కరోనా మొదలు కావడంతో సినిమా విడుదల నిరవధికంగా వాయిదా పడిపోయింది.
Read Also : బన్నీకి ఝలక్ ఇచ్చిన చెర్రీ సినిమా!
జె. మహేంద్రన్, సురేశ్ మీనన్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి డి. ఇమ్మాన్ సంగీతం అందించారు. ప్రభుదేవా సినిమాకు ఇమ్మాన్ మ్యూజిక్ ఇవ్వడం ఇదే మొదటిసారి. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ ను స్కిప్ చేయబోతోందట. అతి త్వరలోనే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో మూవీని స్ట్రీమింగ్ చేస్తారని తెలుస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక సమాచారాన్ని అతి త్వరలోనే ఇస్తామని దర్శక నిర్మాతలు చెబుతున్నారు.