SPIRIT : ప్రభాస్‌తో పెట్టుకుంటే ఇంతే సంగతులా? ‘స్పిరిట్’పై మాకు నమ్మకం లేదు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ సినిమా అంటే బాక్సాఫీస్ దగ్గర వందల కోట్ల వర్షం కురవాల్సిందే. కానీ అదే సమయంలో రెబల్ స్టార్ సినిమా అనుకున్న సమయానికి థియేటర్లలోకి వస్తుందా అంటే మాత్రం ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి. ప్రస్తుతం ప్రభాస్ క్రేజీ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో వస్తున్న‘స్పిరిట్‘ సినిమా విషయంలోనూ ఇదే చర్చ నడుస్తోంది.
గత కొంతకాలంగా ప్రభాస్ సినిమాల రిలీజ్ పరిస్థితి గమనిస్తే ఏదీ అనుకున్న సమయానికి రావడం లేదు. సినిమా షూటింగ్ ఆలస్యం కావడం లేదా పోస్ట్ ప్రొడక్షన్ పనుల వల్ల విడుదల తేదీలు మారడం డార్లింగ్ ఫ్యాన్స్‌కు అలవాటైపోయింది. “ప్రభాస్ సినిమా అంటే రిలీజ్ వాయిదా పడాల్సిందే” అనే ముద్ర పడిపోయింది. తాజాగా ‘స్పిరిట్’ సినిమాను 2027 మార్చి 5న విడుదల చేస్తామని ప్రకటించినప్పటికీ ట్రేడ్ వర్గాల్లో మాత్రం నమ్మకం కలగడం లేదు. ఈ భారీ ప్రాజెక్ట్ ఇప్పటివరకు కేవలం ఒకే ఒక షూటింగ్ షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. ప్రభాస్ తన డేట్స్ కేటాయించడం షూటింగ్ స్పీడ్ పెంచడంలో జాప్యం జరుగుతోందనే వార్తలు ఫిలిం నగర్లో చక్కర్లు కొడుతున్నాయి. చేతిలో మూడు నాలుగు పెద్ద సినిమాలు ఉన్నప్పటికీ వాటిని సకాలంలో పూర్తి చేయడంలో ప్రభాస్ కొంత వెనకబడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. సినిమా ఎప్పుడు స్పీడందుకుంటుందో ప్రభాస్ పూర్తిస్థాయిలో డేట్స్ ఎప్పుడు ఇస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. మరోవైపు చెప్పిన డేట్ కు వస్తామని మేకర్స్ చెప్తున్నా కూడా మాకు నమ్మకం లేదని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఒక్కో సినిమా కోసం రెండు మూడేళ్లు సెట్స్‌పైనే గడుపుతున్న ప్రభాస్, ‘స్పిరిట్’ను అనుకున్న టైమ్‌కు తీసుకొస్తారా లేక మరో కొత్త రిలీజ్ డేట్ వెతుక్కోవాల్సి వస్తుందా అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. ఒకవేళ వాయిదా పడకుండా సినిమా రిలీజ్ అయితే మాత్రం అది టాలీవుడ్లో ఒక పెద్ద రికార్డుగానే మిగిలిపోతుంది.
Also Read
- Kajal Aggarwal: స్టోరీల ఎంపికపై కాజల్ అగర్వాల్ షాకింగ్ కామెంట్స్.. ఆ ఒక్కరి కోసమే కథలు మారుస్తోందట!
- Romanchakam Glimpse: జానకి చెంతనే రాముడి హృదయం.. సందీప్ వంగా 'రోమాంచకం' గ్లింప్స్ నెక్స్ట్ లెవెల్ ఉందిగా!
- Akhil Akkineni: రాజమౌళి, సుకుమార్, ప్రశాంత్ నీల్‌పై కన్నేసిన అఖిల్ అక్కినేని.. మైండ్‌లో పెద్ద స్కెచ్చే ఉందిగా!
- Naga Vamsi: పర్సంటేజ్ సిస్టమ్ వెనుక కుట్ర! థియేటర్ల మోసాలను బయటపెట్టిన నిర్మాత నాగవంశీ..
తాజావార్తలు
-
Aakasamlo Oka Tara: సెట్స్ నుంచి దుల్కర్ సల్మాన్ షేర్ చేసిన BTS ఫొటో వైరల్.. పెరిగిన అంచనాలు
-
Sanju Samson: జింబాబ్వే టూర్లో నో ఛాన్స్.. సంజు కెరీర్ అప్పుడే ముగియలేదు.. ముందుంది మరో సూపర్ ఛాన్స్!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ అరంగేట్రం సూపర్.. ఆ ఒక్క లోపం సరిదిద్దుకుంటే ఇంగ్లండ్‌కు చుక్కలే..!
-
FIFA World Cup 2026: పోర్చుగల్ ఓటమి.. ముగిసిన రొనాల్డో ప్రయాణం.!
-
IND vs ENG Playing XI: టీమిండియాకు చావో.. రేవో..! నేడే భారత్ – ఇంగ్లాండ్ మూడో టీ20..
ట్రెండింగ్
-
ICC Team: టీ20 ప్రపంచకప్ అత్యుత్తమ జట్టు.. భారత్ నుంచి ఒక్కరికే చోటు.. ఆ ఒక్కరు మన అమ్మాయే!
-
Chanakya Neeti : చాణక్య హెచ్చరిక.. ఇలాంటి వారిని పెళ్లి చేసుకోకండి.!
-
Gardening Tips : మీ గులాబీ మొక్కలు వాడిపోతున్నాయా? మీరు చేసే ఈ 4 తప్పులే దానికి కారణం!
-
Rainy Season Tips : వర్షాకాలంలో వచ్చే రోగాలకు బై..బై.. 5 అద్భుతమైన ఇంటి చిట్కాలు.!
-
IND Playing XI vs ENG: మూడో టీ20లో ఈ ముగ్గురు ఔట్.. టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే!