Site icon NTV Telugu

Prabhas: గందరగోళ పరిస్థితుల్లో ప్రభాస్ నిర్మాతలు?

Prabhas

Prabhas

ప్రభాస్ వరుస సినిమాలు లైన్‌లో పెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆయన ఒక సినిమా షూటింగ్ గ్యాప్‌లో మరో సినిమా షూటింగ్ చేస్తూ, సినిమా షూటింగ్‌లను పూర్తి చేసే పనిలో ఉన్నారు. నిజానికి, గత కొన్నాళ్లుగా “రాజా సాబ్” సినిమా షూటింగ్ జరుగుతూనే ఉంది. డిసెంబర్‌లో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా, అప్పటికి కూడా రిలీజ్ అవుతుందో లేదో చెప్పలేని పరిస్థితి ఉంది. ఇప్పుడు మేకర్స్ ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన టాకీ పార్ట్ పూర్తి చేసి సిద్ధంగా ఉండగా, సాంగ్స్ వచ్చే నెలలో పూర్తి చేయబోతున్నారు.

Also Read: VishnupriyaBhimeneni : విష్ణు ప్రియ.. అందాలు చూడాల్సిందేనయ్యా..

మరోవైపు, ప్రభాస్ “ఫౌజీ” అనే సినిమా షూటింగ్ కూడా చేస్తున్నాడు. హను రాఘవపూడి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకు సంబంధించిన సగం షూటింగ్ పూర్తయింది. మరోపక్క, ప్రభాస్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో “స్పిరిట్” సినిమాకు కూడా అక్టోబర్ నుంచి డేట్స్ ఇచ్చాడు. కానీ, “రాజా సాబ్”, “ఫౌజీ” సినిమాల షూట్ ఆలస్యం కావడంతో, “స్పిరిట్” అక్టోబర్‌లో మొదలయ్యే అవకాశం తక్కువే. నిజానికి, “స్పిరిట్” సినిమా షూటింగ్ ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడింది. ప్రభాస్ కోసమే సందీప్ రెడ్డి వంగా వెయిట్ చేస్తున్నాడు.

మరోపక్క, “కల్కి” సెకండ్ పార్ట్ స్క్రిప్ట్ పూర్తి చేసి, ప్రభాస్ కోసం వెయిట్ చేస్తున్నారు. కానీ, ప్రభాస్ ఇప్పటివరకు క్లారిటీ ఇవ్వలేదు. దీంతో, నాగ్ అశ్విన్ తన తదుపరి సినిమాను పట్టాలెక్కించే పనిలో పడ్డాడు. ప్రభాస్ కనుక “స్పిరిట్” షూట్‌కి వెళితే, “ఫౌజీ” డిలే అవుతుంది. కాబట్టి, ప్రభాస్ సినిమాల నిర్మాతలు అందరూ ఒక రకంగా గందరగోళ పరిస్థితుల్లో ఉన్నారు. ప్రభాస్ ఏ సినిమాకి డేట్స్ ఇస్తాడు, ఎప్పుడు సినిమాలు పట్టాలెక్కుతాయి అనే విషయంపై క్లారిటీ లేదు.

Exit mobile version