పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పలు భారీ సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే థియేటర్లలోకి రావాల్సిన ప్రాజెక్టులు, షూటింగ్‌లో ఉన్న సినిమాలు, ఇంకా లైన్‌లో ఉన్న కొత్త సినిమాలు ఆయన షెడ్యూల్ టాలీవుడ్‌లోనే కాకుండా పాన్-ఇండియా స్థాయిలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ క్రమంలోనే ప్రభాస్, యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు ప్రశాంత్ వర్మ కాంబినేషన్‌లో ప్లాన్ అవుతున్న సినిమా గురించి వినిపిస్తున్న వార్తలు అభిమానుల్లో భారీ ఆసక్తి రేపుతున్నాయి.
Also Read : Thaman : అనిరుద్ కావాలి అన్నవారికి థమన్ ఇచ్చిన సాలిడ్ రిప్లై !
ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ గురించి రీసెంట్‌గా ప్రశాంత్ వర్మ స్వయంగా స్పందించారు. “ప్రభాస్ డేట్స్ వస్తే షూటింగ్ వెంటనే స్టార్ట్ అవుతుంది” అని ఆయన క్లారిటీ ఇచ్చారు. అయితే తాజాగా మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఎంటంటే.. ప్రశాంత్ వర్మ ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ కోసం ప్రీ-ప్రొడక్షన్ వర్క్ మొత్తానికి పూర్తి చేశారని సమాచారం. కథ, స్క్రీన్‌ప్లే, విజువలైజేషన్, టెక్నికల్ డీటైల్స్ అన్నీ రెడీగా ఉన్నాయని, ఇంతవరకు ఏం ఎలా చేయాలి అనే దాని మీద పూర్తిస్థాయి ప్లానింగ్ పూర్తి చేశారట. అంటే ప్రభాస్ డేట్స్ కేవలం ఒకసారి ఫిక్స్ అయితే షూటింగ్ ఎటువంటి డిలే లేకుండా సులభంగా మొదలు పెట్టవచ్చు అన్నమాట. అయితే అభిమానుల ప్రశ్న ఒక్కటే ప్రభాస్ డేట్స్ ఎప్పుడు వస్తాయి? ఆయన షెడ్యూల్ నుంచి ఈ కొత్త సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? అన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.