కల్కి 2898 ఏడీ తర్వాత భారీ గ్యాప్ ఇచ్చిన ఆరడుగుల కటౌట్ ప్రభాస్ ఈ ఏడాది ఫ్యాన్స్ ముందుకు రాలేదన్న మాటే కానీ ఎక్కడో ఓ చోట, ఏదో ఒక రూపంలో కనిపిస్తూ, వినిపిస్తూ తన ప్రజెన్స్ చాటుతున్నాడు. కన్నప్పలో 15 నిమిషాలు కనిపించి ఫ్యాన్స్ ఆకలి కాస్తో కూస్తో తీర్చిన డార్లింగ్ ఇయర్ ఎండింగ్ ఫుల్ మీల్స్ రెడీ చేస్తారు అనుకున్నారు. కానీ సంక్రాంతికే రాజా సాబ్ ఆగమనం ఖాయం చేసుకోండని ప్రొడక్షన్ హౌస్ ఎనౌన్స్ ఇచ్చి.. టీజర్, ట్రైలర్లతో ఎజెస్ట్ చేసుకోమని చెప్పేసింది.
Also Read : Akhanda2 Thaandavam : అఖండ 2 కోసం పాట పాడిన ప్రముఖ ప్రవచన ప్రచారకర్త
ఇక డార్లింగ్‌ను బాక్సాఫీస్ దగ్గర చూడలేమా అనుకుంటున్న టైంలో బాహుబలి ది ఎపిక్‌ని తెచ్చేస్తున్నాడు రాజమౌళి. రెండు మాస్టర్ పీస్‌లను మిళితం చేసి ఇంకొంత యాడ్ చేసి కొన్నింటినీ డిలీట్ చేసి అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు తెచ్చేస్తున్నాడు. మరీ ఇది ఫ్యాన్స్‌కు సరిపోతుందా.. అందుకు వాళ్ల కోసమే అక్టోబర్ 23న రెబలోడి రెండు సినిమాలు రీ రిలీజ్ కాబోతున్నాయి. 2006లో రిలీజైన పౌర్ణమి అప్పట్లో కమర్షియల్ ప్లాప్. బుల్లితెరపై మంచి వ్యూస్ కొల్లగొట్టిన ఈ ఫిల్మ్ అక్టోబర్ 23న 4కె వర్షన్‌లో రీ రిలీజ్ కాబోతోంది. ఇక అదే రోజు డై హార్ట్ ఫ్యాన్స్ కల్ట్ ఫిల్మ్ సలార్ కూడా ప్రేక్షకుల ముందుకు మరోసారి రాబోతోంది. ఇక్కడ విశేషమేమిటంటే.. ఈ ఏడాది మార్చిలోనే రీ రిలీజయ్యింది సలార్. అయినా సరే ఫ్యాన్స్ కోసం కాటేరమ్మ కొడుకు వచ్చేస్తున్నాడు. ప్రభాస్ ఫస్ట్ ఫిల్మ్ ఈశ్వర్ కూడా డార్లింగ్ బర్త్ డేకే రీరిలీజ్ చేస్తున్నారు మేకర్స్. 4కె వర్షన్‌లో తీసుకు వస్తున్నారు. ఇవే కాదు బర్త్ డేకు అప్ కమింగ్ మూవీస్ నుండి వన్ ఆర్ టూ సర్ ప్రైజెస్‌లు కూడా ఉండొచ్చు. ఇక ఈ ఏడాది బాక్సాఫీస్ దగ్గరే కాదు మీడియా కంటికి కూడా కనిపించని డార్లింగ్ బాహుబలి ది ఎపిక్ ప్రమోషన్లలో సందడి చేసి ఫ్యాన్స్‌ను కాస్త కూల్ చేస్తాడేమో చూద్దాం