Prabhas: ఆల్ ఆన్ ట్రాక్.. ‘సలార్ 2’ ఒక్కటే డిసప్పాయింట్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Prabhas: ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో దూసుకుపోతున్నారు. ఒకవైపు భారీ బడ్జెట్ చిత్రాలు, మరోవైపు విభిన్న కథాంశాలతో ఫ్యాన్స్‌కు బ్యాక్-టు-బ్యాక్ ట్రీట్స్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఫౌజీ’ షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు డార్లింగ్. ఈ సినిమా షూటింగ్ ఏప్రిల్ చివరి వరకు నిర్విరామంగా కొనసాగనుంది. పీరియాడిక్ వార్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాను వచ్చే దసరాకు రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. మరోవైపు, బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించిన ‘కల్కి 2898 AD’ పార్ట్-2 అప్పుడే పట్టాలెక్కేసింది. కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్‌లపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సీక్వెల్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Also Read: Megastar: రామ్ చరణ్ కంటికి సర్జరీ.. మెగాస్టార్ ఎమోషనల్ పోస్ట్!
Also Read
- Suriya: స్టేజ్‌పై డైరెక్టర్ రాజమౌళికే స్వీట్ షాక్ ఇచ్చిన స్టార్ హీరో సూర్య! వైరల్ అవుతున్న వీడియో...
- Ranabali Documentary: కథపై హైప్ పెంచుతుందా? ఆసక్తిని చంపేస్తుందా?.. రణబాలి డాక్యుమెంటరీ స్ట్రాటజీపై హాట్ డిబేట్!
- Slum Dog Glimpse: అమ్మ ఉన్నది అన్నం పెట్టడానికి, అడుక్కోవడానికి కాదు.. కన్నీళ్లు పెట్టిస్తున్న ‘స్లమ్ డాగ్’ గ్లింప్స్!
- The Paradise Collections: యాహూ 'జడల్' 2 మిలియన్ కొట్టేశాడు.. కానీ ఇక కష్టమే!
ఇక వీటితో పాటు.. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘స్పిరిట్’ షూటింగ్ కూడా అత్యంత వేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో ప్రభాస్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతుండటంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ప్రస్తుతం ప్రభాస్ లైనప్ తీసుకుంటే.. ఒక్క సలార్ సీక్వెల్ తప్ప మిగతా సినిమాలన్నీ ఓ రేంజ్‌లో దూసుకుపోతున్నాయి. నిజానికి ‘సలార్ 2’ పై ఎక్కడా లైని హైప్ ఉంది. కానీ, ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్‌తో ఓ సినిమా కమిట్ అవడం, ప్రభాస్ భారీ లైనప్ ఉండడంతో వెనక్కి వెళ్లింది. ఇది కూడా మొదలైతే ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ. ఎన్టీఆర్-నీల్ ప్రాజెక్ట్ పూర్తయిన వెంటనే ‘సలార్ 2’ పట్టాలెక్కే అవకాశం ఉంది. అప్పటివరకు ప్రభాస్.. స్పిరిట్, కల్కి 2, ఫౌజీ చిత్రాలను పూర్తి చేయనున్నాడు. కానీ, సలార్ సీక్వెల్ కోసం రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.
Also Read: Peddi: అనుకున్నదే అయిందా? వెనక్కి తగ్గిన పెద్ది, కొత్త రిలీజ్ డేట్ ఇదేనా?
తాజావార్తలు
-
NEET UG 2027: గుడ్ న్యూసా? బ్యాడ్ న్యూసా?.. నీట్ 2027 ప్యాటర్న్ పూర్తిగా మారబోతోందా?
-
Antera Closed: ఎన్టీవీ ఎఫెక్ట్.. చివరకు మూతపడిన ‘అంతేరా’.!
-
Explainer: సూపర్ ఎల్‌నినో కాటు.. 2.3లక్షల మంది బలి?
-
AP Govt: ఏపీలో మున్సిపల్ కమిషనర్ల బదిలీ.. జీవో జారీ చేసిన ప్రభుత్వం..
-
Khairatabad Bypoll: ఖైరతాబాద్‌కు ఉప ఎన్నిక.. గెజిట్ విడుదల.!
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!