Shambala: వణుకు పుట్టించేలా ‘శంబాల’ ట్రైలర్ విజువల్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వెర్సటైల్ హీరో ఆది సాయి కుమార్ నటించిన మిస్టికల్ థ్రిల్లర్ ‘శంబాల: ఎ మిస్టికల్ వరల్డ్’ ప్రస్తుతం అందరిలోనూ బజ్‌ను క్రియేట్ చేస్తూ ట్రెండ్ అవుతోంది. మరింత హైప్‌ను పెంచేలా రెబల్ స్టార్ ప్రభాస్ ఈ చిత్రం ట్రైలర్‌ను ఆవిష్కరించి, బృందానికి తన శుభాకాంక్షలు తెలిపారు. ఈ ట్రైలర్‌ను చూస్తే ఆడియెన్స్‌కి ఓ అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ను అందించబోతోన్నట్టుగా కనిపిస్తోంది.
Also Read :Prasanth Varma : ప్రశాంత్ వర్మ మెడపై అడ్వాన్స్’ల కత్తి?
Also Read
- Toxic OTT: బాక్సాఫీస్‌లో షాక్.. ఇప్పుడు ఓటీటీలోకి యశ్ ‘టాక్సిక్’, స్ట్రీమింగ్ డేట్ ఇదేనా?
- Jailer2 Telugu Rights : జైలర్ 2 తెలుగు రైట్స్ కోసం దిల్ రాజు vs నాగవంశీ
- Ranabaali: ప్రెగ్నెంట్‌గా రష్మిక.. ‘జయమ్మ’కు గుడ్‌బై చెప్పేసిన నేషనల్ క్రష్, సెట్స్‌లో విజయ్ స్పెషల్ హగ్!
- Abir Singh Debut: సల్మాన్ ఖాన్ బాడీగార్డ్ కొడుకు హీరోగా ఎంట్రీ.. ‘టార్జాన్’ రాబోతున్న అబీర్, తోడుగా ఆ హీరో!
‘కొన్ని వేల సంవత్సరాల క్రితం పరమశివుడికి, అసురుడికి మధ్య జరిగిన ఓ భీకర యుద్దం.. ఈ కథకి మూలం’ అంటూ సాయి కుమార్ గంభీరమైన వాయిస్ ఓవర్‌తో ట్రైలర్ ఆరంభమైంది. ‘అగ్ని పురాణం ప్రకారం ఆకాశంలో సంగ్రామం జరిగినప్పుడు దుష్ట శక్తులు జంతువుల్ని సైతం ఆవహిస్తాయి’.. ‘వాళ్లేమో చీమ కుట్టినా శివుడి ఆజ్ఞ అని నమ్ముతారు.. విక్రమ్ ఏమో చావులో సైతం సైన్స్ ఉందనే రకం’.. ‘మీరు చెబుతున్న శాస్త్రం మితం.. మీరు తెలుసుకోవాల్సిన మా శాస్త్రం అనంతం’ అనే డైలాగ్స్, ట్రైలర్‌లోని విజువల్స్, బీజీఎం, యాక్షన్ సీక్వెన్స్ చూస్తుంటే సరైన పాన్ ఇండియా కంటెంట్‌లా కనిపిస్తోంది. ఇక ఈ ట్రైలర్లో అర్చన అయ్యర్, స్వశిక, రవివర్మ, మధునందన్, శివ కార్తీక్ పోషించిన ఇతర కీలక పాత్రలను కూడా పరిచయం చేశారు. ఈ చిత్రం క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న ఆడియెన్స్ ముందుకు రానుంది. షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై రాజశేఖర్ అన్నభిమోజు, మహీధర్ రెడ్డి ఈ ప్రతిష్టాత్మక మూవీని భారీ ఎత్తున నిర్మించిన సంగతి తెలిసిందే.
తాజావార్తలు
-
Toxic OTT: బాక్సాఫీస్‌లో షాక్.. ఇప్పుడు ఓటీటీలోకి యశ్ ‘టాక్సిక్’, స్ట్రీమింగ్ డేట్ ఇదేనా?
-
Oman Coast Ship Attack: ఒమన్ తీరంలో భారతీయ సిబ్బంది ఉన్న నౌకపై దాడి.. ఒకరు గల్లంతు
-
Vinayaka Vrata Katha: ‘వినాయక చవితి’ నాడు విజ్ఞాలను తొలిగించే ‘వినాయక వ్రత కథ’ మీకోసం..!
-
Jailer2 Telugu Rights : జైలర్ 2 తెలుగు రైట్స్ కోసం దిల్ రాజు vs నాగవంశీ
-
Amol Muzumdar: భారత్‌కు ఆసియా కప్.. ట్రోఫీ మాత్రం వద్దంటూ బీసీసీఐ నిర్ణయం.. కోచ్ అమోల్ కీలక వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!