యూరప్ హాలిడే కోసం వెళ్ళిన ప్రభాస్ ఎట్టకేలకు తిరిగి వచ్చాడు. ఆయన వచ్చి రాగానే హను రాఘవపూడి డైరెక్షన్‌లో రూపొందుతున్న ఫౌజీ సినిమా షూటింగ్‌లో పాల్గొన్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమా స్వాతంత్ర్యానికి పూర్వం రాసుకున్న కథతో తెరకెక్కిస్తున్నారు. ఒక పీరియాడిక్ సెటప్ సిద్ధం చేశారు. ప్రస్తుతానికి ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది. ప్రభాస్ మీద కొన్ని కీలక సన్నివేశాలు షూట్ చేస్తున్నారు సినిమా టీం.
Also Read:OG Shooting: OG షూటింగ్లో పవన్ స్టన్నింగ్ లుక్
ఈ షెడ్యూల్ జూన్ 5వ తేదీతో పూర్తవుతుందని అంటున్నారు. ఈ సినిమా కోసం ఐదు సెట్స్ అల్యూమినియం ఫ్యాక్టరీలో సిద్ధం చేశారు. మరో ఐదు సెట్స్ మాత్రం రామోజీ ఫిల్మ్ సిటీలో నిర్మించారు. ఈ సినిమాలో ప్రభాస్ ఒక ఆర్మీ ఆఫీసర్ పాత్రలో నటించబోతున్నాడు. ఇమాన్వీ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా గురించి అనేక చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికి ఈ సినిమాకి సంబంధించి 40 శాతం షూటింగ్ పూర్తయింది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది.
Also Read: Sandeep vs Deepika: స్పిరిట్ పంచాయతీలో తప్పెవరిది? బలైంది ఎవరు?
నిజానికి ప్రభాస్ రాజా సాబ్ సినిమా తర్వాతే ఈ సినిమా మొదలుపెట్టారు. కానీ ఆ సినిమా కంటే ఎక్కువ ప్రాధాన్యత ఈ సినిమాకే ఇస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఆయన త్వరలో రాజా సాబ్ సెట్స్‌లో కూడా జాయిన్ కాబోతున్నారు. ఈ రెండు సినిమాలు పూర్తి అయిన తర్వాత స్పిరిట్ సినిమా షూటింగ్‌లో పాల్గొనబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ ఏడాది డిసెంబర్ 5న రాజా సాబ్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. వచ్చే ఏడాది ఫౌజీ రిలీజ్ చేస్తారు. సందీప్ రెడ్డి వంగా ప్రాజెక్టు ఎప్పుడు రిలీజ్ అవుతుందనే విషయం మీద ప్రస్తుతానికి క్లారిటీ లేదు.
