Fauji: ప్రభాస్ ‘ఫౌజీ’ చుట్టూ బిగ్ గేమ్.. ఆ సినిమాల రిలీజ్ డేట్లు మారతాయా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fauji: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్ఠాత్మక చిత్రం ‘ఫౌజీ’. తాజాగా మేకర్స్ ఈ చిత్ర విడుదల తేదీని అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను 2026 డిసెంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించిన వెంటనే బాక్సాఫీస్ పోటీపై ఇండస్ట్రీలో, ట్రేడ్ వర్గాల్లో ఆసక్తికర చర్చ మొదలైంది. ‘ఫౌజీ’ రిలీజ్ అయిన మరుసటి రోజే బాలీవుడ్ స్టార్ హీరోలు అజయ్ దేవగణ్, అక్షయ్ కుమార్ నటిస్తున్న రెండు భారీ చిత్రాలు కూడా థియేటర్లలోకి రానున్నట్లు సమాచారం. దీంతో హిందీ మార్కెట్లో మూడు పెద్ద సినిమాల మధ్య గట్టి పోటీ ఉండే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
ఇదే సమయంలో ‘ఫౌజీ’కి మరో సవాల్ కూడా ఎదురుకానున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత కేవలం రెండు వారాల వ్యవధిలోనే హాలీవుడ్ చిత్రాలు ‘అవెంజర్స్’, ‘డ్యూన్’ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశముండటంతో, దేశవ్యాప్తంగా ఐమ్యాక్స్, 4DX వంటి ప్రీమియం స్క్రీన్ల కోసం తీవ్రమైన పోటీ నెలకొనే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా హిందీ బెల్ట్‌లో స్క్రీన్ షేరింగ్ కీలక అంశంగా మారే అవకాశముందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరో ఆసక్తికర అంశం ఏమిటంటే.. అక్షయ్ కుమార్ నటిస్తున్న చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ‘ఫౌజీ’తో నేరుగా క్లాష్ ఉంటుందా? లేక విడుదల తేదీల్లో మార్పులు చోటుచేసుకుంటాయా? అనే చర్చ ఇప్పుడు సోషల్ మీడియాలో జోరుగా కొనసాగుతోంది. బాక్సాఫీస్ వద్ద పరిస్థితి ఇలాగే ఉంటే మాత్రం డిసెంబర్లో ఫౌజీకి పోటీ తప్పదనే అభిప్రాయం సినీ వర్గాల్లో వ్యక్తం అవుతున్నాయి.
Also Read
- Ramayana Trailer: 'రామాయణ' ట్రైలర్‌కు సెన్సార్ క్లియర్.. ఆ 34 నిమిషాల ఫుటేజ్కూ గ్రీన్ సిగ్నల్!
- Sujeeth: సైలెంట్‌గా పని కానిచ్చేస్తున్న స్టార్ డైరెక్టర్..
- DC Release: దళపతి కోసం వెనక్కి తగ్గిన లోకేష్.. రిలీజ్ డేట్‌ను మార్చేసిన స్టార్ డైరెక్టర్!
- Amitabh Bachchan: అయోధ్యలో అమితాబ్ బచ్చన్ మెగా ప్లాన్ ? రూ.100 కోట్లతో బిగ్ బీ ఏం చేశారో తెలుసా!
తాజావార్తలు
-
Fauji: ప్రభాస్ ‘ఫౌజీ’ చుట్టూ బిగ్ గేమ్.. ఆ సినిమాల రిలీజ్ డేట్లు మారతాయా?
-
AP Local Body Elections: ఏపీలో ఎన్నికల సందడి.. స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధం..
-
US-Iran War: ‘ట్రంప్‌ను చంపేస్తాం’.. శవపేటికలో అమెరికా అధ్యక్షుడు..ఇరాన్ ప్రచారం..
-
ICC Fined: బిగ్‌షాక్.. టీమిండియా యువ పేసర్‌కు భారీ జరిమానా విధించిన ఐసీసీ..
-
Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌కు సెన్సార్ క్లియర్.. ఆ 34 నిమిషాల ఫుటేజ్కూ గ్రీన్ సిగ్నల్!
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్‌లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్‌లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!