Spirit : స్పిరిట్.. హీరోయిన్‌తో ప్రభాస్ ఏం చేస్తున్నాడంటే

Spirit

Spirit

రెబల్ స్టార్ ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘స్పిరిట్’. ఈ సినిమాకు సంబంధించి సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్తలు అభిమానుల్లో భారీ అంచనాలను పెంచుతున్నాయి. తాజాగా ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్‌లో హీరో ప్రభాస్ మరియు హీరోయిన్ త్రిప్తి దిమ్రి జాయిన్ అయ్యారు. హైదరాబాద్‌లోని అజీజ్ నగర్ పరిసరాల్లో ప్రత్యేకంగా వేసిన సెట్స్‌లో చిత్ర యూనిట్ కీలక షెడ్యూల్‌ను నిర్వహించింది. ఈ షెడ్యూల్‌లో హీరో, హీరోయిన్ల పై కొన్ని కీలక సన్నివేశాలను దర్శకుడు సందీప్ రెడ్డి వంగా చిత్రీకరించారు.

హైదరాబాద్ షూటింగ్ స్పాట్ నుండి త్రిప్తి దిమ్రి తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. అయితే, గత కొద్ది రోజులుగా నాన్‌స్టాప్ షెడ్యూల్స్‌తో దూసుకుపోతున్న చిత్ర యూనిట్‌.. తాజాగా షూటింగ్‌కు ఒక రోజు విరామం ఇచ్చినట్టుగా తెలుస్తోంది. కానీ, తదుపరి షెడ్యూల్‌ను వెంటనే హైదరాబాద్‌ కోటి ఉమెన్స్ కాలేజ్‌లో ప్లాన్ చేసినట్టుగా సమాచారం. అక్కడ ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ గెటప్‌లో కొన్ని ఇంటెన్స్ సీన్స్‌లో పాల్గొంటారని సమాచారం. ప్రభాస్ ఈ సినిమాలో మొదటిసారిగా పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నారు. అందుకే.. స్పిరిట్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు రెబల్ స్టార్ ఫ్యాన్స్. సందీప్ రెడ్డి వంగా మార్క్ టేకింగ్‌తో ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించడం ఖాయమని అభిమానులు భావిస్తున్నారు. మరి స్పిరిట్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.