NTV Telugu Site icon

Pooja Hegde : క్యారెక్టర్‌ కోసం ఎంతో కష్టపడతాం.. కానీ మా పేర్లు ఉండవు

Pooja Hegde (2)

Pooja Hegde (2)

టాలీవేడ్ లో అనతి కాలంలోనే వరుస విజయాలతో సౌత్, నార్త్‌లలో తన హవా చూపించింది పూజా హెగ్డే. కానీ కొంత కాలంగా తను నటించిన సినిమాలు వరుసపెట్టి ఫ్లాప్ కావడంతో అవకాశాలు ముఖం చాటేశాయి. కథల ఎంపికలో పొరపాట్లు కూడా ఇందుకు కారణమని చెప్పవచ్చు. ఈ కష్టాలను అధిగమించి పూజా హెగ్డే ఇప్పుడు క్రేజీ ఆఫర్లు అందుకుంటుంది. హిందీ, తమిళంలో ఏకంగా అరడజను సినిమాలు లైన్ లో పెట్టింది. ఈ చిత్రాలతో మరోసారి బలంగా బౌన్స్ బ్యాక్ అవ్వాలనే కసితో ఉంది. అయితే తాజాగా హీరోల రాజ్యం పై సంచలన వ్యాఖ్యలు చేసింది పూజా హెగ్డే.

Also Read: VT15 Movie : వర్క్ మోడ్‌లోకి షిఫ్ట్ అవుతున్న వరుణ్ తేజ్

బ్లాక్ అండ్ వైట్ రోజుల నుంచి నేటి వరకు ఏ సినీ పరిశ్రమ అయిన హీరోల చుట్టూనే తిరుగుతుంది. నమ్మిన నమ్మకపోయినా ఇది నిజం . హీరో ని చూసే సినిమా బిజినెస్ అవ్వడం, లాభాలు రావడం జరుగుతుంది. అందుకే కథలు, కథనాలు అన్ని హీరో కేంద్రంగానే ఉంటాయి.అన్ని రంగాల్లో స్త్రీ, పురుషుల మధ్య వివక్ష ఉన్నట్లుగానే, సినీ పరిశ్రమలోనూ హీరో అలాగే హీరోయిన్ల మధ్య వివక్ష ఉందని, ఇప్పటికే చాలా మంది నటిమనులు చెప్పుకొచ్చారు. ఈ లిస్ట్ లో ఇప్పుడు పూజ కూడా జాయిన్ అయ్యింది..

ఇటీవల ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పూజా హెగ్డే మాట్లాడుతూ.. ‘ హీరోల కేర్‌వాన్‌లు సెట్‌కి దగ్గరగా ఉంటాయి. హీరోయిన్లవి మాత్రం ఎక్కడో దూరంగా ఉంటాయి. మేము బరువైన కాస్ట్యూమ్స్ ధరించి సెట్ వరకు నడుచుకుంటూ రావాలి, ఆ సమయంలో పొడవైన బట్టలు ఈడ్చుకుంటూ వచ్చి తిరిగి వెళ్లాల్సి ఉంటుంది. క్యారెక్టర్‌ కోసం అంత కష్టపతాం. కానీ పోస్టర్‌పై మా పేర్లు కూడా ఉండవ్‌. సినిమా అనేది సమిష్టి కృషి. ఈ విషయం వారికెందుకు అర్థం కాదు? లవ్‌స్టోరీల్లో కూడా హీరోయిన్లకు గుర్తింపు ఇవ్వరు. నిజానికి అందరూ నా అభిమాన హీరోలే. వారందరూ మాతో బాగానే ఉంటారు. చుట్టూ ఉన్నవాళ్లే ఓవర్‌ యాక్షన్‌ చేస్తారు’ అంటూ చెప్పుకొచ్చింది పూజా హెగ్డే.