Pooja Hegde: చాలా రోజుల తర్వాత టాలీవుడ్ కి కళ వచ్చింది. ఒకేరోజు విడుదలైన రెండు సినిమాలకు మంచి టాక్ రావటంతో పాటు ఓపెనింగ్స్ కూడా వచ్చాయి. వాటిలో ఒకటైన ‘సీతారామం’ సినిమాను అందరూ క్లాసిక్ మూవీ అని, ఎపిక్ లవ్ స్టోరీ అని పొగిడేస్తున్నారు. ఇక ఇందులో సీతగా లీడ్ రోల్ పోషించింది మృణాల్ ఠాగూర్. పాత్రలోని డెప్త్ వల్ల అమ్మడికి కూడా ప్రశంసలు దక్కుతున్నాయి. తెలుగు నేర్చుకుని మరీ ఆ పాత్ర పోషణ చేయటం వల్ల మృణాల్ అందరినీ ఆకట్టుకోగలుతోంది. అయితే నిజానికి ఈ సీత పాత్రకు ముందు ఎంపిక చేసింది తనను కాదట. టాలీవుడ్ టాప్ హీరోయిన్ పూజా హేగ్డేను ముందు ఈ పాత్రకు ఎంపిక చేశారట. అమ్మడు ఈ సినిమా కోసం నెల రోజుల పాటు డేట్స్ కూడా కేటాయించిందట. అయితే సెట్స్ రెడీ చేసుకుని యూనిట్ షూటింగ్ కి సిద్ధమైనపుడు పూజ కోవిడ్ వల్ల పూర్తిగా బక్కచిక్కి పోయిందట. దాంతో షాక్ తిన్న దర్శకనిర్మాతలు షూటింగ్ వాయిదా వేస్తే భారీ నష్టాలు చవిచూడాల్సి వస్తుందని భావించి ప్రత్యామ్నాయంగా మరో హీరోయిన్ ఎంపికలో పడ్డారట. అలా వచ్చిన వారిలో దర్శకుడు హను రాఘవపూడికి మృణాల్ తప్ప వేరే ఎవరూ నచ్చకపోవడంతో సీతగా మృణాల్ సెటిలైంది. సో కరోనా పూజ పాలిట విలన్ అయి చక్కటి పాత్రను మిస్ చేసిందన్న మాట. అదే ఈ సీత పాత్ర పూజకు దక్కి ఉంటే సినిమాకు మరింత మంచి మైలేజ్ రావటంతో పాటు వరుస పరాజయాల్లో ఉన్న అమ్మడి ఖాతాలో మరో విజయం జతకలసి ఉండేది. ఏం చేస్తాం. ఎవరికి ఎంత వరకూ ప్రాప్తమో! అంతే!
Pooja Hegde: అసలు ‘సీత’ పూజా హెగ్డేనా!?
Show comments