Site icon NTV Telugu

Sita Ramam: పూజాహెగ్దే నో చెప్పింది.. ఇప్పుడు ఆ సినిమా హిట్ కొట్టింది..?

Sita Ramam

Sita Ramam

కొంత మంది హీరో హీరోయిన్లు మంచి సినిమాలకు నో చెప్పి.. మళ్లీ ఆసినిమా బ్లాక్‌ బాస్టర్‌ అవడంతో.. అయ్యె మిస్సయ్యానే అని నిరాస పడుతుంటారు. మరికొందరైతే ఆహీరోయిన్‌, హీరో తో నేను నటించాలా? అంటూ ఎదుటి వారిని తక్కువ చేసి వాల్లేదో లేకపోతే ఆసినిమా చేసే అవకాశం లేనట్లు బిల్డప్పులు ఇస్తుంటారు. ఎంత హిట్‌ అయినా.. సినిమా ఎలా దూసుకుపోయినా ప్రేక్షకుల చేతిలో వుంటుందని మరిచిపోతారు. ప్రేక్షకుల టాక్‌.. మంచి సినిమా స్క్రిప్ట్‌ వుంటే ఆ సినిమాను ప్రేక్షకులు ఎప్పుడు ఆహ్వానిస్తారు. అదిమరిచి హీరో హీరోయిన్స్ నేనే గొప్ప, నేనే స్టార్‌ అంటూ, నాకంటూ స్టార్‌ టాక్‌ వుందని పొగరు కొందరి సినీ ప్రముఖుల్లో వుంటుంది. దానికి నిదర్శనం నో చెప్పిన సినిమాలు బ్లాక్‌ బాస్టర్‌ కొట్టడం. ఇలాంటి వరుసలో కలర్ ఫోటో ఒకటైతే, మరొకటి సీతారామం సినిమా అని చెప్పొచ్చు.

డేట్స్‌ కుదరకో లేక సినిమా స్ర్కిప్ట్‌ నచ్చకో సీతారామం సినిమాకు హీరోయిన్‌ గా ఆఫర్‌ వచ్చిన మన పొడువకాళ్ల సుందరి పూజా హెగ్దే నోచెప్పిందట. ఇప్పుడు ఆ సినిమా క్లాసికల్ బ్లాక్‌ బాస్టర్‌ హిట్‌ అయి విజయంవైపు ముందుకు దూసుకు పోతుండటంతో నాలుక కరుచుకుని అరేరే ఈ సినిమా నేను చేసింటే బాగుండేది కాదా అనుకుంటోందని టాక్. సీతారామం సినిమాకు నో చెప్పడంతో.. హీరోయిన్‌ మృణాళ్ ఈ ఛాన్స్‌ కొట్టేసింది. ఈసినిమా ఇంత క్లాసికల్‌ హిట్‌ అవుతుందని హీరోయిన మృణాల్‌ కూడా అంచనా వేయలేదేమో కానీ.. సీతారామం మూవీ ఆడియెన్స్‌ నుంచి ఈ సినిమాకు అద్భుతమైన రెస్పాన్స్‌ రావడంతో ఇంత మంచి సినిమా తనకు ఇచ్చినందుకు హీరోయిన్‌ మృణాల్‌ ఠాకూర్‌ డైరెక్టర్‌ను గట్టిగా పట్టుకొని ఏడ్చేసింది, కృతజ్ఞతలు తెలిపింది. దీంతో.. హీరో దుల్కర్‌ సైతం సినిమాకు వస్తున్న రెస్పాన్స్‌ను చూసి ఒకింత ఎమోషనల్‌ అయ్యారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ కూడా అయ్యింది.

అయితే సీతా రామం సినిమాలో దుల్కార్-మృణాళ్ మధ్య కెమిస్ట్రీ సూపర్‌గా సెట్ అయింది. కాగా..యుద్ధంతో రాసిన ప్రేమకథ అంటూ ప్రేక్షకులు ముందుకు వచ్చిన సీతా రామం క్లాసిక్ బ్లాక్‌బస్టర్ టాక్‌తో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. సీతా రామం హిట్‌తో మృణాళ్‌కు టాలీవుడ్‌లో వరుస ఆఫర్లు క్యూకట్టడం ఖాయంగా కనిపిస్తోంది. సీతా రామం హిట్ టాక్‌తో మంచి కలెక్షన్లు రాబట్టే ఛాన్స్ కనిపిస్తోంది. ఓటీటీలకే ఇన్నాళ్లు పరిమితమైన ఫ్యామిలీ ఆడియన్స్, థియేటర్స్‌లో చూసేందుకు తరలి వస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ రష్మిక మందన్న, టాలీవుడ్ హీరో సుమంత్‌ కీలక పాత్రలు పోషించారు. కాగా.. ప్రకాశ్ రాజ్, గౌతం మీనన్, తరుణ్ భాస్కర్, భూమిక తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. సీతా రామం సినిమా తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో వైజ‌యంతీ మూవీస్, స్వప్న సినిమాస్ బ్యాన‌ర్స్‌పై ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ నిర్మించారు.

Exit mobile version