ఒకప్పటి స్టార్ హీరో, డైలాగ్ కింగ్, నటుడు మంచు మోహన్ బాబు ఇంట వివాదం హాట్ టాపిక్ అవుతుంది. కుమారుడు మీద మోహన్ బాబు దాడి చేయడం కుమారుడు మోహన్ బాబు మీద దాడి చేయడం వంటి కేసులతో ఇప్పటికే మీడియా అంతా అదే చర్చ జరుగుతోంది. తాజాగా మంచు మోహన్ బాబు నివాసానికి పోలీసు బందోబస్తు చేరుకుంది. మంచు మనోజ్ సామాగ్రి మొత్తాన్ని వెహికల్స్ లో తరలించేందుకు మంచు కుటుంబ సభ్యులు వాహనాలు సిద్ధం చేశారు. ప్రస్తుతం మంచు మనోజ్ ఉంటున్నది ఈ మోహన్ బాబు ఇల్లు కావడంతో మనోజ్ లోపలికి రావడానికి వీలులేదని మోహన్ బాబు అంటున్నారు. ఈ నేపథ్యంలోనే మంచు మనోజ్ కి సంబంధించిన సామాగ్రి తరలించేందుకు మొత్తం మూడు వాహనాలను సిద్ధం చేశారు.
Pushpa 2: జస్ట్ 1000 మిస్.. 5 రోజుల్లో ఎన్ని కోట్లంటే?
ఎలాంటి గొడవలకు తావు లేకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది. పోలీసులు సహాయంతోనే మనోజ్ సామాగ్రి తరలించేందుకు మోహన్ బాబు సిబ్బంది సిద్ధమవుతున్నారు. ఇక ఇప్పటికే తనకు భద్రత కల్పించాలని ఇంటెలిజెంట్ డీజీని మంచు మనోజ్ కలిశారు. అనంతరం ఆయన డిజిపి ఆఫీస్ కి వెళ్లారు. ఆశ అందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే అందాల్సి ఉంది. ఇక ఈ ఉదయం మంచు మనోజ్ ఏర్పాటు చేసిన బౌన్సర్లు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో మంచు విష్ణు ఏర్పాటు చేసిన బాన్సర్లు వారిని అడ్డుకున్నారు. దీంతో బౌన్సర్ల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. ఆ వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.