PM Modi: పవన్ ఇంటికి ప్రధాని మోడీ.. సోషల్ మీడియాలో ఫ్యామిలీ పిక్ వైరల్! ఫోటో చూశారా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: టాలీవుడ్ పవర్ స్టార్, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నివాసంలో ఈ రోజు (ఆదివారం) ఒక అపురూపమైన సన్నివేశం చోటుచేసుకుంది. ఇటీవల సర్జరీ చేయించుకుని కోలుకుంటున్న పవన్ కళ్యాణ్‌ను పరామర్శించేందుకు దేశ ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా వారి ఇంటికి తరలివచ్చారు. అసలు ఏం జరిగిందంటే.. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గత కొద్దిరోజులుగా అనారోగ్యం కారణంగా తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా పవన్ కళ్యాణ్ ఇంటికి వచ్చి పరామర్శించి అందరినీ ఆశ్చర్యపరిచారు. పవన్ కళ్యాణ్‌ను గతంలోనే ‘ఆంధీ’ (సుడిగాలి) అని అభివర్ణించిన మోడీ, ఇప్పుడు స్వయంగా ఆయన ఇంటికి రావడం జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది.
Went to the residence of Andhra Pradesh Deputy Chief Minister, Shri Pawan Kalyan Garu and met him as well as his family. Enquired about Pawan Kalyan Garu’s well being and wished him good health.@PawanKalyan pic.twitter.com/FfIbr1bPDi
Also Read
- Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
- Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
- Jailer 2 Pre Release Event: హైదరాబాద్‌లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
- Ganesh Acharya Biopic: తెరపైకి స్టార్ కొరియోగ్రాఫర్ లైఫ్ స్టోరీ.. ‘గణేశ్’ ట్రైలర్ చూశారా!
— Narendra Modi (@narendramodi) May 10, 2026
20 నిమిషాల పాటు ఆత్మీయ భేటీ
ప్రధాని మోడీ పవన్ నివాసంలో దాదాపు 20 నిమిషాల పాటు గడిపారు. పవన్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకోవడమే కాకుండా, ఆయన కుటుంబ సభ్యులతో సరదాగా ముచ్చటించారు. ఈ పర్యటనకు సంబంధించిన ఫోటోలను ప్రధాని స్వయంగా సోషల్ మీడియా వేదికగా పంచుకోవడంతో అవి క్షణాల్లో వైరల్ అయ్యాయి. తాజాగా వైరల్ అవుతున్న ఫోటోలలో ఒక పిక్ మాత్రం ‘పిక్ ఆఫ్ ది డే’గా నిలిచింది. పవన్ కళ్యాణ్ తన కుటుంబంతో కలిసి ప్రధానితో గ్రూప్ ఫోటో దిగారు. ఇందులో పవన్ కళ్యాణ్, అన్నా లెజినోవా, అకిరా నందన్, ఆద్య, పోలేనా అంజనాలతో పాటు పవన్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. చిన్నారి మార్క్ శంకర్ భుజంపై ప్రధాని మోడీ చేయి వేసి నవ్వుతూ ఫోటోకు పోజు ఇవ్వడం చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట సెన్సేషన్ సృష్టిస్తున్నాయి.
ఈ సందర్భంగా ప్రధాని మోడీకి ధన్యావాదాలు తెలుపుతూ పవన్ కళ్యాణ్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ‘నా నివాసానికి వచ్చి పరామర్శించడం గొప్ప అనుభూతి కలిగించింది. నా ఆరోగ్య పరిస్థితి తెలుసుకునేందుకు విచ్చేయడం.. ఆయనలోని ఆప్యాయత, అనురాగం మనవతావాద నాయకత్వాన్ని ప్రతిబింబిస్తున్నాయి. ప్రధాని మోడీ చూపిన ఆదరణను ఎప్పటికీ గుర్తంచుకుంటాను’ అని రాసుకొచ్చారు.
I am truly grateful to you Hon PM Shri @narendramodi ji for your concern and warmth. The memories you have given us will be cherished for the rest of our life. https://t.co/gNEmsW4I0F
— Pawan Kalyan (@PawanKalyan) May 10, 2026
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!