PEDDI POWERPLAY TOUR : ‘పెద్ది’ ప్రమోషనల్ టూర్ ప్లాన్ వచ్చేసింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రామ్ చరణ్ మరియు దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్లో వస్తున్న చిత్రం పెద్ది. ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ప్రమోషన్లు భారీగా నిర్వహించబోతున్నారు. అందుకు సంబంధించి ప్లాన్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. మే 18న దేశ ఆర్థిక రాజధాని ముంబైలో స్టార్ట్ కానున్నపెద్ది ప్రమోషన్స్ అక్కడి నుండి వరుసగా దేశంలోని కీలక నగరాల్లో భారీ ఈవెంట్లను నిర్వహించనున్నారు. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో నిర్వహించబోయే ఈవెంట్ టాలీవుడ్ చరిత్రలోనే అతిపెద్ద వేడుకగా నిలవబోతోందని సమాచారం.
పవర్ ప్లే టూర్ లో మే 18 ముంబైలో ఈవెంట్ నిర్వహించి అక్కడ ట్రైలర్ లాంచ్ చేయబోతున్నారు. మే 22 ఉప్పల్ స్టేడియంలో జారబోయే ఐపీయల్ మ్యాచ్ కు పెద్ది టీమ్ రాబోతుంది. ఆ తర్వాత మే 23 భోపాల్ లో ఈవెంట్ నిర్వహించనున్నారు. మే 24 బెంగళూరులో ప్రెస్ మీట్ నిర్వహించి మే 28 ఢిల్లీలో మరొక ఈవెంట్ నిర్వహించబోతున్నారు. మే 30 చెన్నై కీలక ప్రెస్ మీట్ ఉండబోతుంది. విజయనగరం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు జూన్ 01న భారీ ఈవెంట్ చేస్తున్నారు. ఫైనల్ గా జూన్ 02న హైదరాబాద్ లో బిగ్గెస్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయబోతున్నారు. ఈ భారీ ప్రమోషన్ల అనంతరం జూన్ 3వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ప్రీమియర్ షోలు ప్రదర్శించబడతాయి. ఇక జూన్ 4వ తేదీన ‘పెద్ది’ థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఏ.ఆర్. రెహమాన్ సంగీతం ఇప్పటికే ఊపేస్తోంది. ఓవర్సీస్ లో హోంబలే ఫిల్మ్స్ పంపిణీ తోడవడంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట మొదలుపెట్టడం ఖాయంగా కనిపిస్తోంది.
Also Read
- Killer Movie Accident: ఎస్.జె.సూర్య 'కిల్లర్' సెట్స్‌లో సిలిండర్ బ్లాస్ట్.. ఒకరు మృతి, ముగ్గురి పరిస్థితి విషమం!
- 4 Years of Vikram: లోకనాయకుడి 'విక్రమ్' కి నాలుగేళ్లు.. నేటికీ చెక్కు చెదరని ఎల్సీయూ (LCU) రికార్డ్స్!
- Peddi: పెద్ది టార్గెట్ పెద్దదే.. కానీ?
- Dhanush Political Entry: విజయ్‌కు పోటీగా ధనుష్ పాలిటిక్స్ ఎంట్రీ?
తాజావార్తలు
-
Chicken Keema Paratha Recipe: యమ్మీ.. యమ్మీ.. చికెన్ కీమా పరోటా.. సింపుల్‌గా ఇలా ఇంట్లోనే చేసుకోండి..!
-
Central Cabinet: భారీ శుభవార్త చెప్పిన కేంద్ర కేబినెట్.. తెలంగాణలో ఆ రహదారులు ఇక 4 లైన్లుగా..
-
T20 World Cup: కేవలం భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌కే హైప్ తెస్తారా.. సంచలన వ్యాఖ్యలు చేసిన స్మృతి మంధాన..
-
Monsoon: అన్నదాతలకు శుభవార్త.. 24 గంటల్లో కేరళను ముద్దాడనున్న తొలకరి వాన
-
Killer Movie Accident: ఎస్.జె.సూర్య ‘కిల్లర్’ సెట్స్‌లో సిలిండర్ బ్లాస్ట్.. ఒకరు మృతి, ముగ్గురి పరిస్థితి విషమం!
ట్రెండింగ్
-
Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, Dimensity 7450 చిప్‌తో.!
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!