రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు దర్శకత్వంలో “పెద్ది” అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసింది. ఈ సినిమాలో రామ్ చరణ్ ఒక క్రికెట్ ఆటగాడిగా కనిపించబోతున్నట్లు, గతంలో రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ క్లారిటీ ఇచ్చింది. అయితే, ఆయన కేవలం క్రికెట్ మాత్రమే కాదు, సినిమాలో చాలా ఆటలు ఆడతాడని చెబుతున్నారు. ఇదిలా ఉంచితే, హీరోయిన్‌తో కలిసి ఆయన “చికిరి చికిరి” అంటూ పాడుకుంటున్న ఒక సాంగ్‌ను ఇటీవల రిలీజ్ చేశారు. ఇక ఈ సాంగ్ సెన్సేషన్ క్రియేట్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇప్పటివరకు తెలుగులో టాప్ సాంగ్‌గా రికార్డులు సృష్టించిన పుష్ప 2లోని కిస్సిక్ సాంగ్ ఆల్ టైం రికార్డు వ్యూస్ రికార్డుని,
Also Read :K Ramp: ఓటీటీలోకి కే ర్యాంప్.. ఎక్కడ, ఎప్పుడు చూడాలంటే?
చిక్కిరి చిక్కిరి సాంగ్ సగం టైంలోనే బ్రేక్ చేసింది. ప్రస్తుతం ఈ సినిమా సాంగ్ యూట్యూబ్‌లో 13 దేశాల వ్యాప్తంగా నెంబర్ వన్ ట్రెండింగ్ అవుతుంది. నిజానికి, ఈ చిక్కిరి చిక్కిరి అనే పదం విన్నప్పుడు, ఇదేదో తేడాగా ఉందే, పాట వర్కౌట్ అవ్వదేమో అని అందరూ అనుకున్నారు. కానీ, ఆ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ, ఈ చిక్కిరి చిక్కిరి సాంగ్ ఇప్పుడు ఆల్ టైం రికార్డు వ్యూస్ బద్దలు కొడుతూ ముందుకు దూసుకుపోతుందని చెప్పాలి. ప్రస్తుతం ఈ సినిమా సాంగ్ రికార్డులు ఇంకా పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదు. మొత్తంగా చూసుకుంటే, ఎన్నో రికార్డులు బద్దలు కొట్టేందుకు ఈ సాంగ్ సిద్ధమవుతుందని చెప్పాలి.