Site icon NTV Telugu

Peddi: త్వరలో ‘పెద్ది’ ఫస్ట్ సింగిల్.. రెహ్మాన్తో చరణ్ స్పెషల్ పిక్

Peddi

Peddi

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’. బుచ్చిబాబు సాన దర్శకత్వంలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పిస్తున్నాయి. టైటిల్ గ్లింప్స్, రామ్ చరణ్ ఫస్ట్ లుక్, అతని కొత్త మేకోవర్ అభిమానులు, సినిమా ప్రేమికులలో అంచనాలను ఆకాశానికి తాకేలా చేశాయి. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ వేగంగా సాగుతోంది.

Also Read:Tunnel: సెప్టెంబర్ 12న తెలుగులో అథర్వ మురళి ‘టన్నెల్’

మేకర్స్ తాజాగా ఓ ఆసక్తికర అప్డేట్‌ను విడుదల చేశారు. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘పెద్ది’ ఫస్ట్ సింగిల్ త్వరలో రిలీజ్ కానుందని ప్రకటించారు. రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు సాన, సతీష్ కిలారు, ఏఆర్ రహ్మాన్ స్టూడియోలో ఉన్న ఫోటోను షేర్ చేస్తూ సోషల్ మీడియాలో సందడి చేశారు. ఈ ఫోటో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. ‘పెద్ది’ కోసం ఆస్కార్ విజేత ఏఆర్ రహ్మాన్ అద్భుతమైన మ్యూజిక్ ఆల్బమ్‌ను సిద్ధం చేశారు. ఆడియన్స్, ఫ్యాన్స్ గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే పాటలను రూపొందించారు.

Also Read:Never Ducked In ODIs: వన్డే కెరీర్‌లో ఎప్పుడూ డకౌట్ కానీ ఆ నలుగురు.. లిస్ట్‌లో మనోడు కూడా ఉన్నాడు!

ఈ చిత్రంలో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా, కన్నడ సూపర్‌స్టార్ శివరాజ్‌కుమార్ శక్తివంతమైన పాత్రలో కనిపించనున్నారు. జగపతి బాబు, దివ్యేందు శర్మ కూడా ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. సినిమాటోగ్రఫీని రత్నవేలు అందిస్తుండగా, నేషనల్ అవార్డ్ విజేత నవీన్ నూలి ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ‘పెద్ది’ 2026 మార్చి 27న పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.

Exit mobile version