Peddi : అప్పటి నుంచే జాన్వీ సీన్లు కట్ చేసిన ‘పెద్ది’!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన ‘పెద్ది’ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట కొనసాగిస్తున్నప్పటికీ.. సినిమాలో హీరోయిన్ జాన్వీ కపూర్ క్యారెక్టరైజేషన్, ఆమె లవ్ ట్రాక్‌పై గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో విపరీతమైన నెగెటివిటీ వ్యక్తమవుతోంది. నెటిజన్లు, సినీ క్రిటిక్స్ నుంచి కూడా తీవ్రమైన అభ్యంతరాలు వ్యక్తమవడంతో ఎట్టకేలకు దర్శకుడు బుచ్చిబాబు ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. ‘పెద్ది’ చిత్రంలో వివాదాస్పదంగా మారిన జాన్వీ కపూర్ సీన్లపై ఆయన వెనక్కి తగ్గారు. ఈ సినిమాలో జాన్వీ కపూర్ పాత్రకు సంబంధించిన కొన్ని అభ్యంతరకర సన్నివేశాలను థియేటర్ల నుండి తొలగిస్తున్నట్లు (ట్రిమ్ చేస్తున్నట్లు) దర్శకుడు బుచ్చిబాబు తన అధికారిక ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా సంచలన ప్రకటన చేశారు.
సినిమా అనేది కేవలం ప్రేక్షకులను అలరించడానికే గానీ.. ఎవరినీ ఇబ్బంది పెట్టడానికి, ఎవరి గౌరవానికి భంగం కలిగించడానికి కాదని బుచ్చిబాబు స్పష్టం చేశారు. ‘పెద్ది’ సినిమాలోని కొన్ని సన్నివేశాలపై ఆడియన్స్ నుంచి వచ్చిన నెగెటివ్ ఫీడ్‌బ్యాక్‌ను ఒక దర్శకుడిగా తాను చాలా సీరియస్‌గా తీసుకున్నట్లు వెల్లడించారు. సినిమాలో జాన్వీ కపూర్ ప్రెజెంటేషన్ ఎవరినైనా బాధించి ఉంటే.. ప్రేక్షకుల సెంటిమెంట్లను మనస్ఫూర్తిగా గౌరవిస్తూ ఆయన హృదయపూర్వక క్షమాపణలు తెలియజేశారు.
Also Read
- Anasuya: నా గొంతు నొక్కేయాలని చూశారు.. భరించలేకే జబర్దస్త్ నుంచి బయటకొచ్చా?
- Gunasekhar: అలా పుట్టిందే 'ఒక్కడు' సినిమా.. డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు.!
- Varanasi: రాముడు vs కుంభకర్ణుడు.. ఆ 30 నిమిషాల సీక్వెన్స్ ఆడియన్స్‌కు మైండ్ బ్లాకే.! జక్కన్న స్క్రిప్ట్ మాములుగా లేదుగా.!
- Prakash Raj: నాగబాబుకు ప్రకాష్ రాజ్ స్ట్రాంగ్ కౌంటర్.. "మేము గొర్రెలం కాదు..!"
మారుతున్న ప్రేక్షకుల ఆలోచనలు, వారి సెన్సిటివిటీస్‌కు తాము బాధ్యత వహిస్తామని.. భవిష్యత్తులో తీయబోయే చిత్రాల్లో మహిళా పాత్రలను మరింత గౌరవప్రదంగా, పద్ధతిగా చూపిస్తానని బుచ్చిబాబు ప్రామిస్ చేశారు. ఈ మేరకు థియేటర్లలో ఉన్న అభ్యంతరకర సన్నివేశాలను మార్చబోతున్నట్లు వెల్లడించారు. ఈరోజు (శనివారం) సాయంత్రం షోల నుంచే ఈ ట్రిమ్ చేసిన సరికొత్త వెర్షన్ ప్రేక్షకులకు థియేటర్లలో అందుబాటులోకి రానుంది. తప్పును ఎత్తిచూపినప్పుడు ఈగోలకు పోకుండా, ప్రేక్షకుల అభిప్రాయాన్ని గౌరవించి తక్షణమే సీన్లను లేపేయాలని బుచ్చిబాబు తీసుకున్న ఈ నిర్ణయంపై ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.
తాజావార్తలు
-
Peddi : అప్పటి నుంచే జాన్వీ సీన్లు కట్ చేసిన ‘పెద్ది’!
-
Anasuya: నా గొంతు నొక్కేయాలని చూశారు.. భరించలేకే జబర్దస్త్ నుంచి బయటకొచ్చా?
-
Digital Arrest Scam: ముందు కాల్ వస్తుంది.. తర్వాత వీడియో కాల్.. చివరికి ఖాతాలోని డబ్బంతా మాయం!
-
Manav Suthar: టీమిండిలో మరో యువ కెరటం.. భారత టెస్టు జట్టులోకి దూసుకొచ్చిన ఈ కుర్రాడు ఎవరో తెలుసా?
-
CM Revanth Reddy: నన్ను మభ్యపెట్టడం అంత ఈజీ కాదు.. సీఎం రేవంత్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!