PEDDI Press Meet : ‘పెద్ది’ షూటింగ్ ఫినిష్.. నేడు మేకర్స్ భారీ ప్రెస్ మీట్.. రిలీజ్ డేట్ ఛేంజ్
టాలీవుడ్‌లో అత్యంత ఆసక్తిని రేకెత్తిస్తున్న ‘పెద్ది’. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా జూన్ 25న రిలీజ్ చేస్తామని ఆ మధ్య ప్రకటించారు. కానీ ఇప్పుడు ఆ డేట్ మరోసారి చేంజ్ కాబోతుంది. అందుకు సంబంధించి చిత్ర యూనిట్ నేడు కీలక ప్రకటన చేయబోతోంది. ఈ రోజు మధ్యాహ్నం 1 గంటకు పెద్ది సినిమా మేకర్స్ ఒక భారీ ప్రెస్ మీట్‌ను ఏర్పాటు చేయబోతున్నారు. ఈ సమావేశంలో సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించనున్నారు. అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించారు.
అలాగే ఈ సినిమా షూటింగ్ నిన్నటితో ముగిసింది. అలాగే ఈ సినిమాకు సంబంధించి మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్ కూడా వినిపిస్తోంది. ఈ సినిమా ప్రమోషన్స్ విషయంలో చిత్ర యూనిట్ ఒక వ్యూహాన్ని అనుసరిస్తోంది. సాధారణంగా సినిమా విడుదలకు ముందు అన్ని పాటలను విడుదల చేయడం ఆనవాయితీ. కానీ ‘పెద్ది’ సినిమా నుండి ఇప్పటికే రెండు సాంగ్స్ రిలీజ్ చేయగా ఇక కేవలం ఒకే ఒక పాటను మాత్రమే రిలీజ్ చేయాలనీ నిర్ణయించినట్టు తెలుస్తోంది. అదే శృతి హాసన్ నటించిన సాంగ్. ఇది ‘ఐటమ్ సాంగ్’ కాదు సినిమా కథలో భాగంగా వచ్చే ఒక ‘స్పెషల్ సాంగ్’. శృతి హాసన్ ఎనర్జీ మేకర్స్ మేకింగ్ స్టైల్ కలిసి ఈ పాటను నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్లాయని సమాచారం. శృతి హాసన్ సాంగ్ మినహా సినిమాలో ఉండే మిగిలిన పాటలన్నీ డైరెక్ట్ గా సినిమాలోనే చూసేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. నేటి మధ్యాహ్నం జరగబోయే ప్రెస్ మీట్‌లో ఈ విషయాలపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
Also Read
- Tollywood : బీస్ట్ మోడ్‌లోకి స్టార్ బ్యూటీస్.. రియల్ స్టంట్స్ చేస్తోన్న హీరోయిన్స్
- OTT Movies : థియేటర్స్‌లో చిన్న చిత్రాలు.. దెబ్బ కొడుతున్న ఓటీటీ సినిమాలు
- Patriot : పేట్రియాట్ అడ్వాన్స్ బుకింగ్స్ ఇండస్ట్రీ హిట్ లోడింగ్.. కానీ తెలుగు రిలీజ్ డౌటే
- Bellamkonda : తిరుమలలో ఘనంగా బెల్లంకొండ శ్రీనివాస్ - కావ్య వివాహం
తాజావార్తలు
-
PEDDI Press Meet : ‘పెద్ది’ షూటింగ్ ఫినిష్.. నేడు మేకర్స్ భారీ ప్రెస్ మీట్.. రిలీజ్ డేట్ ఛేంజ్
-
Virat Kohli: అంపైర్లతో విరాట్ కోహ్లీ వాగ్వాదం.. కింగ్ ఆగ్రహం సరైందేనా?, నిబంధనలు ఏమంటున్నాయి?
-
West Bengal Elections 2026: ఫలితాలకు ముందే రణరంగా మారిన బెంగాల్.. స్ట్రాంగ్ రూమ్‌ల దగ్గర దీదీ ధర్నా..
-
TTD Laddu Report: తిరుమల లడ్డూ వ్యవహారంపై ప్రభుత్వానికి నివేదిక.. కీలక అంశాలు వెలుగులోకి తెచ్చిన ఏక సభ్య కమిటీ..
-
Mamata Banerjee: బీహార్, మహారాష్ట్ర కాదు.. ఇది బెంగాల్.. ఎన్నికల సంఘంపై మమతా బెనర్జీ విమర్శలు
ట్రెండింగ్
-
3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!