Peddi 4 days Collections : పెద్ది 4 డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్.. జస్ట్ మిస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పెద్ది బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం ఆగడం లేదు. జూన్ 3న ప్రీమియర్స్ తో రిలీజ్ అయిన ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా థియేటర్లలో కలెక్షన్ల తుఫాను సృష్టిస్తోంది. విడుదలైన నాలుగు రోజుల్లోనే భారీ వసూళ్లు రాబట్టింది “బాక్సాఫీస్ ఛాంపియన్” అనే ట్యాగ్‌ను వందకు వంద శాతం నిజం చేస్తూ అన్ని ప్రాంతాలలోనూ ఈ చిత్రం కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ప్రీమియర్స్‌తో కలిపి మొటిరోజు రూ. 135 కోట్ల కొల్లగొట్టిన పెద్ది.. రెండో రోజుల్లో రూ. 181 కోట్లు రాబట్టింది. ఇక మూడు రోజుల్లోనే రూ. 236 కోట్లు సాధించగా.. నాలుగు రోజుల్లోనే ట్రిపుల్ సెంచరీ చేస్తుందని అనుకున్నారు. కానీ ఆ మార్క్ ను కొద్దిలో మిస్ అయింది పెద్ది.
నాలుగు రోజులకుగాను ఫస్ట్ వీకెండ్ ముగిసేనాటికి ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.292.5 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్టుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. సినిమాకు లభించిన హిట్ టాక్, దానికి తోడు లాంగ్ వీకెండ్ సెలవులు కలిసి రావడంతో థియేటర్లన్నీ హౌస్‌ఫుల్ బోర్డులతో కళకళలాడాయి. మాస్, క్లాస్ అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడుతున్నారు. వీకెండ్ ముగిసినప్పటికీ ఈ సినిమా జోరు తగ్గేలా కనిపించడం లేదు. రెండు తెలుగు రాష్ట్రాలలో బయ్యర్లందరినీ భారీ లాభాల జోన్లోకి తీసుకెళ్లేలా ‘పెద్ది’ బాక్సాఫీస్ రన్ సాగుతోంది. ఈ 4 రోజుల సాలిడ్ కలెక్షన్లను బట్టి చూస్తుంటే రాబోయే రోజుల్లో ఈ చిత్రం మరిన్ని మునుపటి రికార్డులను బద్దలు కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది.
Also Read
తాజావార్తలు
-
Peddi 4 days Collections : పెద్ది 4 డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్.. జస్ట్ మిస్
-
Relationship Controversy: అందానికి ముగ్ధుడై పిల్లనిచ్చిన అత్తతో ప్రేమలో పడ్డ అల్లుడు.. లేచిపోయి వివాహం
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
INDIA Alliance Meeting: విజయ్ పార్టీకి ఊహించని పరిణామం.. టీవీకేను పక్కన పెట్టిన ఇండియా కూటమి?
-
SIP Rules: SIP చేస్తున్నవారిలో చాలామంది పట్టించుకోని కీలక విషయాలు.. దీర్ఘకాలంలో భారీ ప్రభావం!
ట్రెండింగ్
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!