Site icon NTV Telugu

Pawan Kalyan : చిరంజీవి జన్మతః ఓ ఫైటర్.. పవన్ కళ్యాణ్ ఎమోషనల్

Chiranjeevi Pawan Kalyan

Chiranjeevi Pawan Kalyan

మెగాస్టార్ చిరంజీవి తొలిసారిగా తెరమీద కనిపించి, ఈరోజుకు 47 ఏళ్లు పూర్తయ్యాయి. ఆయన నటించిన ప్రాణం ఖరీదు సినిమా 1978 సంవత్సరంలో రిలీజ్ అయింది. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవికి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెలువల కురుస్తున్నాయి. కొద్దిసేపటి క్రితం ఇదే విషయం మీద పవర్ స్టార్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. “మాకు ఇంకా లీల కాగుతుంది పెద్దన్నయ్య. ప్రాణం ఖరీదు సినిమాలో హీరోగా నటించిన నేను స్కూల్లో చదువుతున్నాను. అప్పట్లో కనకమహాలు థియేటర్ కి వెళ్లి ఆ సినిమా చూసిన అనుభూతిని మాటల్లో వర్ణించలేను.

Also Read:Nara Lokesh: చరిత్ర రాయాలన్నా.. సృష్టించాలన్నా విజయవాడతోనే!

ఈ 47 ఏళ్ల సినీ ప్రయాణంలో ఆయన ఎన్నో అంశాలలో పై స్థాయికి వెళ్లారు. అయినా సరే, ఇప్పటికీ మంచి మనిషిగా సాయం చేస్తూ అందరికీ తలలో నాలుకలా ఉన్నారు. ఆయనకు దుర్గాదేవి ఆశీస్సులు లభించాలని, మరిన్ని సంవత్సరాలు ఇదే విధంగా సినీ పరిశ్రమలో సక్సెస్ తో మంచి ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటున్నాను. మరిన్ని సంవత్సరాలు ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో అలరించాలని కూడా కోరుకుంటున్నాను. ఆయనలాంటి వారికి రిటైర్మెంట్ అనేది ఉండదు, ఆయన కోరుకుంటే తప్ప. నాకు తెలిసినంతవరకు ఆయన ఎప్పటికీ రిటైర్మెంట్ కోరుకోరు. మా పెద్దన్నయ్య జన్మతః ఓ ఫైటర్. దగ్గర వారికి శంకర్ బాబు, అభిమానించే వారికి మెగాస్టార్ చిరంజీవి” అంటూ తన సోదరుడి గురించి పవన్ కళ్యాణ్ రాసుకోస్తూ, తన సోదరుడితో కలిసి ఉన్న కొన్ని అపురూపమైన ఫోటోలను ఆయన షేర్ చేశారు.

Exit mobile version