ఇటీవలే ‘హరి హర వీరమల్లు’తో పలకరించిన పవన్‌కల్యాణ్ అదే జోష్‌తో ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ను పూర్తి చేశారు. పవన్ – హరీశ్ శంకర్ కాంబినేషన్ అంటేనే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉంటాయి. గతంలో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్ సింగ్’ తో రాబోతున్నారు. ఈ సినిమాలో పవన్ కల్యాణ్ ఒక మాస్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నట్టు సమాచారం. శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తుండగా, దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. పవన్ మాస్ మేనరిజం, డీఎస్‌పీ మ్యూజిక్, హరీష్ శంకర్ టేకింగ్ – ఈ మూడింటి కాంబినేషన్ చూసి ఫ్యాన్స్ థియేటర్లు దద్దరిలడం ఖాయం. అయితే తాజాగా దర్శకుడు గుడ్‌న్యూస్ చెప్పారు.
Also Read : Salman khan : బాలీవుడ్ భాయ్‌ను టేకప్ చేసిన మలయాళ మాస్ మేకర్!
ఈ సినిమాలో పవన్‌కు సంబంధించిన షెడ్యూల్ పూర్తయినట్లు తెలుపుతూ ఓ ప్రత్యేక ఫోటో పంచుకున్నారు.. ఈ సందర్భంగా పవన్‌పై ప్రశంసలు కురిపించారు.. ‘మాటిస్తే నిలబెట్టుకోవడం, మాట మీద నిలబడటం.. మీరు పక్కనుంటే కరెంట్ పాకినట్లే. ఈ రోజును నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేనని దర్శకుడు తెలిపారు. పవన్ ఎనర్జీ సినిమాకు మరింత పవర్‌ను ఇచ్చింది. సపోర్ట్ ఇచ్చినందుకు ధన్యవాదాలు’ అని తెలిపారు. ప్రస్తుతం హరీశ్ షేర్ చేసిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో పవన్ సింపుల్ లుక్‌లో కనిపించడంతో అభిమానులు షేర్ చేస్తున్నారు. ఇక ముందు ముందు ఈ మూవీకి సంబంధించిన ఒక్కో అప్ డేట్ కోసం వేట్ చేయల్సిందే. మొత్తానికి రాజకీయలో ఎంత బీజిగా ఉన్నప్పటికి ఒప్పుకున్న సినిమాలు ఒక్కొక్కటిగా పూర్తిచేసుకుంటు వస్తున్నారు పవన్ కల్యాణ్. హరీష్ చెప్పినట్లుగా మాటిస్తే నిలబెట్టుకోవడంలో పవర్ స్టార్ ముందున్నారు.