ఓజీ తర్వాత ఇక సినిమాలు ఆపేస్తాడేమో అనుకున్న పవన్ కళ్యాణ్, నలుగురు నిర్మాతలకు డేట్స్ ఇచ్చినట్లు వార్తలు వచ్చినట్లు తెలిసింది. అందులో ముఖ్యంగా దిల్ రాజుకైతే డేట్స్ కన్ఫర్మ్ అయ్యాయి. అయితే, ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, దిల్ రాజు ఇప్పటివరకు డైరెక్టర్‌ని లాక్ చేయలేదు. కేవలం పవన్ కళ్యాణ్, దిల్ రాజు మీద ఉన్న గౌరవంతో ఆ డేట్స్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్‌తో సాలిడ్ సినిమా చేసే దర్శకుడు ఎవరా అని దిల్ రాజు వేటలో పడ్డాడు.
Also Read:Raashi Khanna: పిచ్చి ముం* బూతు అని తెలియదు!
ఫైనల్‌గా ఈ లిస్టులో అనిల్ రావిపూడి పేరు మొదటి వరుసలో వినిపిస్తోంది. గతంలో ‘భగవంత్ కేసరి’ లాంటి సోషల్ సబ్జెక్ట్ చేసి, అనిల్ రావిపూడి ఏకంగా నేషనల్ అవార్డు కూడా సాధించిపెట్టాడు. ఈ నేపథ్యంలో, అలాంటి ఒక సోషల్ మెసేజ్‌తోనే పవన్ కళ్యాణ్‌తో సినిమా చేసేందుకు దిల్ రాజు ప్రయత్నిస్తున్నాడు. గతంలో దిల్ రాజు నిర్మాణంలో రూపొందిన ‘వకీల్ సాబ్’ కూడా కొంతవరకు సామాజిక స్పృహ ఉన్న సినిమానే. ఇప్పుడు కూడా అనిల్ రావిపూడి, పవన్ కళ్యాణ్ కాంబినేషన్‌లో ఇలాంటి ఒక సినిమా ఫిక్స్ చేయాలని దిల్ రాజు ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే, ఒకవేళ అనిల్ రావిపూడి ఆ లిస్టులో లేకపోతే, తరువాత దర్శకుడు ఎవరా అనే చర్చ కూడా జరుగుతుంది.
