రాశి ఖన్నాకి తెలుగులో హీరోయిన్‌గా మంచి పేరుంది. బ్లాక్ బస్టర్ హిట్స్‌లో భాగం కాకపోయినా, సెన్సిబుల్ సినిమాలు చేస్తుందనే పేరు ఉంది. అయితే, ఈ మధ్యకాలంలో ఆమె తెలుగు సినిమాలు చాలా తగ్గించేసింది. తగ్గించేసింది అనడం కన్నా, ఆమెతో సినిమాలు చేసేందుకు దర్శక నిర్మాతలు పెద్దగా ఆసక్తి కనపరచలేదు. అయితే, సిద్దు జొన్నలగడ్డ హీరోగా నీరజ కోన డైరెక్ట్ చేసిన తెలుసు కదా అనే సినిమాలో మాత్రం ఆమెను హీరోయిన్‌గా ఎంపిక చేశారు. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఆమె మాట్లాడిన ఒక బూతు మాట సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది.
Also Read :గ్రీన్ డ్రెస్‌లో అందాలు ఆరబోస్తున్న రెజినా కాసాండ్రా..
ఆమె ‘పిచ్చి ము’ కాదని అంటూ కామెంట్ చేసింది. అయితే, అది ఒక బూతు పదమనే విషయం తనకు తెలియదని తాజాగా జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో చెప్పుకొచ్చింది. నిజానికి ఆ పదాన్ని తమ సినిమాలో బామ్మ క్యారెక్టర్ వాడుతుందని, సిద్దు క్యారెక్టర్ కూడా వాడుతుందని ఆమె చెప్పుకొచ్చింది. “దీంతో అదేదో క్యూట్ వర్డ్ అనుకొని నేను కూడా మాట్లాడేశాను. కానీ, అది బూతు పదమని తర్వాత తెలిసిందంటూ” ఆమె చెప్పుకొచ్చింది. మొత్తం మీద ఆ పదం సోషల్ మీడియాలో అయితే విపరీతంగా వైరల్ అవుతుంది.